Narendra Modi: ప్రధాని నోట బాహుబలి మాట.. వ్యాక్సిన్ తీసుకుంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు: నరేంద్రమోదీ
Monsoon Parliamentary Session: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే బాహుబలి అంత స్ట్రాంగ్‌గా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ వ్యతిరేక
Monsoon Parliamentary Session: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే బాహుబలి అంత స్ట్రాంగ్‌గా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ వ్యతిరేక పోరాటంలో 40 కోట్ల మందికి ప్రజలు వ్యాక్సిన్ తసుకొని బాహుబలులుగా మారారంటూ మోదీ అభివర్ణించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం.. ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీకా ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని నోట మరోసారి బాహుబలి ప్రస్తావన వచ్చింది. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో బాహుబలి సినిమా ప్రస్తావనను మోదీ అనేక సార్లు తెచ్చారు. దీంతోపాటు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటంతో.. నరేంద్ర మోదీ తన గొడుగు తానే పట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కనీసం ఒక్కడోసు టీకా అయినా తీసుకుని ఉంటారని ఆశిస్తున్నానంటూ మోదీ పేర్కొన్నారు. ఇప్పటివరకూ 40 కోట్లకుపైగా ప్రజలు బాహుబలులుగా మారారంటూ.. వ్యాక్సిన్ తీసుకున్న వారి గురించి ప్రస్తావించారు. కరోనా మహమ్మారి కట్టడి చర్యలపై ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడుతున్నానని.. ఈ సమావేశాల్లో కూడా అదే చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు.
ఈ పార్లమెంట్ సమావేశాలు ఫలవంతంగా సాగాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నానంటూ మోదీ పేర్కొన్నారు. విపక్ష సభ్యులు కఠిన ప్రశ్నలు సంధిస్తూ.. సభ సజావుగా సాగేలా సహకరించాలన్నారు. ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని.. అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. మహమ్మారిపై పోరుకోసం.. ఫ్లోర్ లీడర్లతో చర్చించాలనుకుంటున్నామని మోదీ పేర్కొన్నారు. ఎంపీల నుంచి కూడా సలహాలను స్వీకరిస్తామని తెలిపారు.
Speaking at the start of the Monsoon Session of Parliament. https://t.co/QENuZOzQRh
— Narendra Modi (@narendramodi) July 19, 2021
Also Read: