‘కర్నాటకలో నాయకత్వ మార్పు’… లీకైన వివాదాస్పద ఆడియో టేపు కలకలం… అది ఫేక్ అంటున్న రాష్ట్ర బీజేపీ చీఫ్

కర్నాటకలో నాయకత్వ మార్పు తథ్యమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ..వివాదాస్పద ఆడియో టేప్ ఒకటి బయటపడి కలకలం సృష్టిస్తోంది.

'కర్నాటకలో నాయకత్వ మార్పు'... లీకైన  వివాదాస్పద ఆడియో టేపు కలకలం... అది ఫేక్ అంటున్న రాష్ట్ర బీజేపీ చీఫ్
Karnataka Cm Yeddyurappa
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 19, 2021 | 12:52 PM

కర్నాటకలో నాయకత్వ మార్పు తథ్యమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ..వివాదాస్పద ఆడియో టేప్ ఒకటి బయటపడి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర కొత్త సీఎంగా ముగ్గురి పేర్లను బీజేపీ చీఫ్ నళిని కుమార్ కతీల్ పేర్కొన్నారంటూ ఆయన గొంతుతో వెలువడిన ఈ క్లిప్ రాజకీయవర్గాల్లో అప్పుడే ప్రకంపనలు రేపుతోంది.ఇందులో సీఎం ఎడ్యూరప్ప ఇక వైదొలగుతారని, ఆయన స్థానే ముఖ్యంగా పార్టీ నేత సదానంద గౌడ పేరు వినవస్తోందని, అలాగే కేబినెట్ లో కొందరు పాతవారికి ఉద్వాసన పలకవచ్చునని కతీల్ ఓ ఎమ్మెల్యేకి చెప్పినట్టు ఈ వీడియో క్లిప్ లో ఉన్నట్టు తెలిసింది. కానీ ఆ స్వరం నాది కాదని, దీనిపై ఎంక్వయిరీ జరిపించాలని నళిని కుమార్ సీఎం ఎడ్యూరప్పకు రాసిన లేఖలో కోరారు. ఎవరో తన గొంతును అనుకరించి మాట్లాడారన్నారు. ఇటీవల ఢిల్లీలో ఎడ్యూరప్ప ప్రధాని మోదీతోను, ఇతర బీజేపీ నేతలతో కూడా భేటీ అయి వచ్చారు. ఆ నేపథ్యంలో ఇక నాయకత్వ మార్పు జరగవచ్చునన్న ఊహాగానాలకు ఇది ఆజ్యం పోస్తోంది. అయితే తన రాజీనామా ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసినప్పటికీ .. ఈ ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి.

పైగా ఈ ఆడియో టేప్ వ్యవహారంపై నళిని కుమార్ గానీ, ఆయన సహచరులు గానీ పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు. ఈ నెల 26 న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది; ఆ రోజుతో ఎడ్యూరప్ప పదవి చేబట్టి రెండేళ్లు పూర్తి అవుతాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 లో జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలనీ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒక విధంగా చురుకైన , యువ నాయకత్వం అవసరమని కూడా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా పేర్కొంటున్నారు..

మరిన్ని ఇక్కడ చూడండి: OTT: ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. లిస్టులో రెండు బడా చిత్రాలు!

Karthika Deepam: మోనిత గతం వెలుగులోకి.. అంజిని పట్టుకుంటే నిజం తెలుస్తుందంటున్న దీప..