PM Modi: బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని..

అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. భగవాన్‌ రాముడికి ఆరతి ఇచ్చారు. తరువాత అయోధ్యలో రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షోకు హాజరయ్యారు. సుగ్రీవా ఖిల్లా నుంచి లతా మంగేష్కర్‌ చౌక్‌ వరకు రోడ్‌షో కొనసాగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అయోధ్యలో రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం మోదీకి ఘనస్వాగతం పలికారు.

PM Modi: బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని..
Pm Modi
Follow us
Srikar T

| Edited By: Basha Shek

Updated on: May 05, 2024 | 10:55 PM

అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. భగవాన్‌ రాముడికి ఆరతి ఇచ్చారు. తరువాత అయోధ్యలో రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షోకు హాజరయ్యారు. సుగ్రీవా ఖిల్లా నుంచి లతా మంగేష్కర్‌ చౌక్‌ వరకు రోడ్‌షో కొనసాగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అయోధ్యలో రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం మోదీకి ఘనస్వాగతం పలికారు. మోదీ రోడ్‌షో సందర్భంగా అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కూడా హాజరయ్యారు. ప్రధాని మోదీ రోడ్‌షోకు మహిళలు కూడా బ్రహ్మరథం పట్టారు.

అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ మే 5 ఆదివారం అయోధ్యకు విచ్చేశారు. రాముడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత, ప్రధాని మోదీ లతా మంగేష్కర్ చౌక్ నుండి సుగ్రీవ్ ఫోర్ట్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా రోడ్ షో నిర్వహించారు. అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. శ్రీరాముడి లాగే అయోధ్య ప్రజలు విశాల హృదయం కలిగిన వాళ్లని అన్నారు మోదీ. రోడ్‌షోకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించిందన్నారు. ఈనెల 14వ తేదీన మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌కు ముందు బాలరాముడి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ.

అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం చేసిన తర్వాత తొలిసారిగా అయోధ్యకు విచ్చేశారు. లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. దీనికి ముందే అయోధ్యలో ఆయన పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల మొదలైన తర్వాత ప్రధాని తొలిసారిగా అయోధ్యకు వచ్చారు. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు మద్దతుగా మోదీ రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు ఇటావా సభలో మోదీ ప్రసంగించారు. మే 20న ఐదో దశలో అయోధ్యలో పోలింగ్‌ జరగనుంది.

సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట అయిన ఇటావాపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రచారం కొనసాగుతోంది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన అయిదురుగు సభ్యులు లోక్ సభ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ సభల్లో ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎన్నడూ గెలవని ఇటావాలో ఇదివరకే యోగీ ఆదిత్యనాథ్ రెండు ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…