PM Modi: బడ్జెట్‌ అమలులో సరికొత్త సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. 23 నుంచి ‘సప్తఋషి’ వెబినార్లు.. షెడ్యూల్ ఇదే..

బడ్జెట్‌ సమావేశాల అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను  ఒకే వేదికపైకి తీసుకురానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

PM Modi: బడ్జెట్‌ అమలులో సరికొత్త సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. 23 నుంచి 'సప్తఋషి' వెబినార్లు.. షెడ్యూల్ ఇదే..
Pm Modi
Follow us

|

Updated on: Feb 22, 2023 | 9:12 PM

ప్రధానమంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా బడ్జెట్‌లో పలు సంస్కరణలను తీసుకొచ్చింది. ముందుగా బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి తీసుకొచ్చారు. తద్వారా రుతుపవనాల ప్రారంభానికి ముందు మంత్రిత్వ శాఖలు, శాఖలు నిధుల వినియోగానికి తగిన సమయం దొరికేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ అమలులో మరికొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మోడీ ప్రభుత్వం. ఇందులో భాగంగా బడ్జెట్‌ సమావేశాల అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను   ఒకే వేదికపైకి తీసుకురానున్నారు ప్రధాని మోడీ. అలాగే రంగాల వారీగా అమలు చేసే వ్యూహాలపై సహకారంతో పనిచేయడానికి ప్రధాన మంత్రి ఈ ఆలోచనను రూపొందించారు. జన్ భగీదరి స్ఫూర్తితో 2021లో ఈ వెబ్‌నార్లను ప్రారంభించారు. బడ్జెట్ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడం, సంబంధిత వాటాదారులందరి ప్రమేయం, యాజమాన్యాన్ని ప్రోత్సహించడమే ఈ వెబినార్ల ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 11 మధ్య జరిగే 12 పోస్ట్-బడ్జెట్ వెబ్‌నార్లు జరగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశాల్లో పాల్గొని కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. కాగా కేంద్ర బడ్జెట్ 2023-24లో వివరించిన ‘సప్తఋషి’ ప్రాధాన్యతలను రూపొందించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు వెబ్‌నార్‌లను నిర్వహిస్తున్నాయి.

వెబినార్ల షెడ్యూల్‌..

వెబ్‌నార్లు త్రైమాసిక లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళికల తయారీకి వివిధ మంత్రులు, శాఖలు, సంబంధిత వాటాదారులందరి సమన్వయ ప్రయత్నాలపై దృష్టి సారించాయి.వీటికి సంబంధిత కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు, రెగ్యులేటర్లు, విద్యాసంస్థలు, వాణిజ్యం, పరిశ్రమల సంఘాలు తదితర కీలక వాటాదారులు హాజరుకానున్నారు.

1. గ్రీన్ గ్రోత్ – ఫిబ్రవరి 23

ఇవి కూడా చదవండి

2. వ్యవసాయం, సహకార సంస్థలు- 24 ఫిబ్రవరి

3. యువత శక్తి- నైపుణ్యం- విద్య- 25 ఫిబ్రవరి

4. రీచింగ్‌ ద లాస్ట్‌ మైల్‌/ లీవింగ్‌ నో సిటిజన్‌ బిహైండ్‌ – 27 ఫిబ్రవరి

5. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ యూజింగ్ టెక్నాలజీ- ఫిబ్రవరి 28

6. పట్టణాభివృద్ధి- ప్రణాళికలు- మార్చి 1

7. డెవలపింగ్‌ టూరిజమ్‌ ఇన్‌ మిషన్‌ మోడ్‌- మార్చి 3

8. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌: PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌తో లాజిస్టిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం- మార్చి 4

9. హెల్త్‌ అండ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ – మార్చి 6

10. ఆర్థిక రంగం- మార్చి 7

11. మహిళా సాధికారత- మార్చి 10

12. PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (PM వికాస్)- మార్చి 11

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..