ప్రధాని మోదీని కలిసిన ప్రత్యేక అతిధి
ప్రతివిషయంలో నిశ్చలంగా కనిపించే ప్రధాని మోదీ ఓ పసివాడిని ఆడిస్తూ నవ్వుతూ కనిపిస్తున్న ఫోట్ ఒకటి నెట్లింట్లో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ అందరికీ తెలిసిన వారే.. అయితే ఆయన ఆడిస్తున్న ఆ ముద్దులొలికే పాపాయి ఎవరనే విషయంపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో కింద .. పార్లమెంట్‌లో నన్ను కలిసేందుకు ప్రత్యేకమైన అతిధి వచ్చారు అంటూ ప్రధాని కామెంట్ పెట్టారు. ప్రధాని పెట్టిన ఈ పోస్ట్‌ను […]

ప్రతివిషయంలో నిశ్చలంగా కనిపించే ప్రధాని మోదీ ఓ పసివాడిని ఆడిస్తూ నవ్వుతూ కనిపిస్తున్న ఫోట్ ఒకటి నెట్లింట్లో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ అందరికీ తెలిసిన వారే.. అయితే ఆయన ఆడిస్తున్న ఆ ముద్దులొలికే పాపాయి ఎవరనే విషయంపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో కింద .. పార్లమెంట్‌లో నన్ను కలిసేందుకు ప్రత్యేకమైన అతిధి వచ్చారు అంటూ ప్రధాని కామెంట్ పెట్టారు.
ప్రధాని పెట్టిన ఈ పోస్ట్‌ను కొన్ని గంటల్లోనే 10లక్షల మంది చూశారు. అయితే ఈ బాబు ఎవరనే చర్చ తీవ్రంగా సాగుతోంది. మరోవైపు ఈ పసివాడు అమిత్‌షా మనవడు కావచ్చని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేయగా.. మధ్యప్రదేశ్ లోక్‌సభ సభ్యుడు సత్యనారాయణ్ జతియా మనవడిగా తెలుస్తోంది.



