ఉగ్రదాడులు తగ్గాయి..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
జమ్ము కాశ్మీర్‌లో గత దశాబ్ద కాలంలో ఉగ్రదాడుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గత పదేళ్ల కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల సంఖ్య బాగా తగ్గిందని, అధికారిక లెక్కల ప్రకారం 86 శాతం మేర తగ్గినట్టుగా మంత్రి తెలిపారు. 23,290 దాడుల నుంచి ఆ సంఖ్య 3,187కు తగ్గిందని, 2009 ఏప్రిల్ 1 నుంచి 2019 జూన్ 30 […]
జమ్ము కాశ్మీర్‌లో గత దశాబ్ద కాలంలో ఉగ్రదాడుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గత పదేళ్ల కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల సంఖ్య బాగా తగ్గిందని, అధికారిక లెక్కల ప్రకారం 86 శాతం మేర తగ్గినట్టుగా మంత్రి తెలిపారు. 23,290 దాడుల నుంచి ఆ సంఖ్య 3,187కు తగ్గిందని, 2009 ఏప్రిల్ 1 నుంచి 2019 జూన్ 30 వరకు ఈ తగ్గుదల ఉన్నట్టుగా ఆయన చెప్పారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో అలజడి సృష్టించే ఉగ్రమూకలపై నిరంతర నిఘా కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు మంత్రి కిషన్ రెడ్డి.