AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Man : సెంటర్ పాయింట్‌గా మారిన కేరళ దివ్యాంగుడు.. ‘మన్‌ కి బాత్‌’లో ప్రధాని మోదీ ప్రశంసలు

కేరళలోని కొచ్చికి చెందిన దివ్యాంగుడు ఇప్పుడు మీడియాలో సెంటర్ పాయింట్ మారిపోయాడు. దేశ వ్యాప్తంగా ఇతనిపై చర్చ కూడా మొదలైంది. ఆదివారం నాటి ‘మన్‌ కి బాత్‌’ కార్యక్రమంలో..

Kerala Man : సెంటర్ పాయింట్‌గా మారిన కేరళ దివ్యాంగుడు.. ‘మన్‌ కి బాత్‌’లో ప్రధాని మోదీ ప్రశంసలు
Sanjay Kasula
|

Updated on: Jan 31, 2021 | 9:39 PM

Share

Kerala Man : కేరళలోని కొచ్చికి చెందిన దివ్యాంగుడు ఇప్పుడు మీడియాలో సెంటర్ పాయింట్ మారిపోయాడు. దేశ వ్యాప్తంగా ఇతనిపై చర్చ కూడా మొదలైంది. ఆదివారం నాటి ‘మన్‌ కి బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ కేరళకు చెందిన వ్యక్తిని ప్రశంసించారు. ఎన్‌ఎస్‌ రాజప్పన్‌ చేస్తున్న పనిని అద్భుతం అంటూ మెచ్చుకున్నారు ప్రధాని మోదీ.

అయితే.. ప్రధాని మోదీ తన పేరును ప్రస్తావించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రాజప్పన్‌ తెలిపారు. కేరళలోని కొచ్చికి చెందిన దివ్యాంగుడైన ఆయన ప్రతి రోజు వెంబనాడ్‌ సరస్సులో పడవపై వెళ్లి అందులోని ప్లాస్టిక్‌ బాటిళ్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తుంటారు. అతను చేస్తున్న పనితో ఆ సరస్సు క్లీన్‌గా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా అతను ఇదే పనిలో స్వచ్ఛందగా చేస్తున్నాడు.

ప్రధాని మోదీ తన ‘మన్ కి బాత్’ ప్రసంగంలో తన పేరును ప్రస్తావించినందుకు తాను చాలా గౌరవంగా ఉందని అన్నారు రాజప్పన్. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలన కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Kerala Corona : కేరళలో పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య.. గడిచిన 24 గంటల్లో 5,266 కరోనా కేసులు..

MLA Challa Dharmareddy : హన్మకొండలో హై టెన్షన్.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై దుమారం..

Rajya Sabha Will Adjourn : రాజ్యసభ షెడ్యూల్​లో స్వల్ప మార్పులు..! ఫిబ్రవరి 13నే ముగిసే ఛాన్స్..