అమ్మో.. యువకుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.753 కోట్లు.. కానీ

ఈ మధ్యకాలంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది చేస్తున్నటువంటి పొరబాట్లు, నిర్లక్ష్యాల వల్ల ఒకరికి బదులుగా మరొకరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమ కావడం.. ఆ తర్వాత అవి మళ్లీ వెనక్కి వెళ్లడం తమిళనాడులో పరిపాటిగా మారిపోయింది. గత నెల రాజ్‌కుమార్‌ అనే ఫార్మసీ వర్కర్ ఖాతాలో ఏకంగా 9 వేల కోట్ల రూపాయలు తమిళనాడు మార్కంటైల్‌ బ్యాంక్‌ నుంచి జమ అయ్యింది.

అమ్మో.. యువకుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.753 కోట్లు.. కానీ
Raj Kumar
Follow us
Aravind B

|

Updated on: Oct 08, 2023 | 7:07 PM

ఈ మధ్యకాలంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది చేస్తున్నటువంటి పొరబాట్లు, నిర్లక్ష్యాల వల్ల ఒకరికి బదులుగా మరొకరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమ కావడం.. ఆ తర్వాత అవి మళ్లీ వెనక్కి వెళ్లడం తమిళనాడులో పరిపాటిగా మారిపోయింది. గత నెల రాజ్‌కుమార్‌ అనే ఫార్మసీ వర్కర్ ఖాతాలో ఏకంగా 9 వేల కోట్ల రూపాయలు తమిళనాడు మార్కంటైల్‌ బ్యాంక్‌ నుంచి జమ అయ్యింది. అయితే ఇది మరవక ముందే కొటాక్‌ మహేంద్ర బ్యాంక్‌ నుంచి 756 కోట్ల రూపాయలు తంజావూరులోని ఓ యువకుడి ఖాతాలోకి వచ్చి చేరింది. అలాగే ఖాతాదారుల నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండానే ఆ మొత్తాలను బ్యాంక్‌ వర్గాలు మళ్లీ వెనక్కి తీసుకొంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో శనివారం చైన్నె తేనాంపేటలోని ఓ మెడికల్‌ షాపులో పని చేస్తున్నటువంటి మహ్మద్‌ ఇక్రీష్‌ అనే యువకుడి ఖాతాలోకి 753 కోట్ల 44 లక్షలు రూపాయలు జమ అయ్యాయి.

ఇది చూసిన ఆ యువకుడికి బ్యాంకర్లకు సమాచారం ఇచ్చాయి. దీంతో ఏకంగా అతడి ఖాతాను సీజ్‌ చేసి పడేయడంతో ఇందుకు సంబంధించిన వ్యవహారం మీడియాకు తెలిసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మహ్మద్‌ ఇక్రీష్‌ శుక్రవారం తన ఖాతా నుంచి ఓ మిత్రుడికి 2 వేల రూపాయలు, మరో మిత్రుడికి 100 రూపాయల నగదును బదిలీ చేశాడు. ఆ తర్వాత అతడి బ్యాంక్‌ ఖాతాలోకి పెద్దఎత్తున డబ్బులు జమ అయినట్లుగా ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. కానీ పెద్దగా అతడు పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం తన ఖాతాను చెక్‌ చేసుకున్నారు. అయితే అతని ఖాతాలో 753 కోట్ల 44 లక్షల రూపాయల బ్యాలెన్స్‌ ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

అయితే ఈ విషయంపై సంబంధిత బ్యాంక్‌ సేవా కేంద్రాన్ని అతడు సంప్రదించాడు. అయినా కూడా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో చివరకు బ్యాంక్‌ నెంబర్‌ ఆధారంగా మేనేజర్‌ను సంప్రదించాడు. ఈ సమాచారంతో ఆ బ్యాంక్‌‌కు సంబంధించిన వర్గాలు ఆగమేఘాలపై అతడి ఖాతాను సీజ్‌ చేశాయి. తనకు పెద్దఎత్తున సొమ్ము వచ్చినట్లు అధికారులకు సమాచారం ఇస్తే.. చివరకి తన ఖాతానే సీజ్‌ చేశారని అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే తనకు సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదంటూ ఆ యువకుడు మీడియా దృష్టికి తీసుకు రావడంతో తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవిషయం ఏంటంటే ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఒకరి ఖాతాలోకి బదులుగా మరొకరి ఖాతాలోకి కోట్లాది రూపాయలు బదిలీ జరుగుతున్న సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు