Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: విద్యార్థులు పరీక్షల్లో భయపడుతున్నారా? మోడీతో ప్రత్యేక చర్చా కార్యక్రమం.. మీ సందేహాలను వీడియో ద్వారా పంపండిలా..

విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు రాయాలంటే ఎన్నో భయాలు, ఆందోళలు ఉంటాయి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము..

PM Modi: విద్యార్థులు పరీక్షల్లో భయపడుతున్నారా? మోడీతో ప్రత్యేక చర్చా కార్యక్రమం.. మీ సందేహాలను వీడియో ద్వారా పంపండిలా..
Pm Modi
Follow us
Subhash Goud

|

Updated on: Jan 12, 2023 | 5:45 PM

విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. పరీక్షలు రాయాలంటే ఎన్నో భయాలు, ఆందోళలు ఉంటాయి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. ఇక విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 27న ఢిల్లీలోని తల్కటరా స్టేడియంలో జరుగనుంది. అయితే విద్యార్థులు తమ సందేహాలను ప్రధానమంత్రిని అడుగుదామని అనుకుంటే హెచ్‌డీ క్వాలిటీ కలిగిన వీడియోను జనవరి 15వ తేదీలోగా pibhyderabad@gmail.com ఈమెయిల్ ఐడికి పంపాలని అధికారులు తెలిపారు.

పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి, భయానికి లోనవుతుంటారు. వారిలో భయాన్ని పోగొట్టేందుకే ప్రధాని మోడీ ప్రతి సంవత్సరం ఇలాంటి ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోడీ ప్రత్యేకంగా సంభాషించనున్నారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది పరీక్షలు రాయనున్న విద్యార్థుల ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వనున్నారు. వారిలో భయాన్ని పోగొట్టనున్నారు. ఈ కార్యక్రమంలో 9 నుంచి12 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారు అడిగే సందేహాలను నివృత్తి చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి