పాక్ బుద్ధి ఇంకా మారలేదు.. ప్రధాని మోదీ విమానానికి నో ఎంట్రీ

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రపంచానికి మరోసారి చూపించుకుంటోంది. తమ గగన తలం మీది నుంచి భారత ప్రధాని విమానం వెళ్లేందుకు అనుమతిని నిరాకరిస్తూ..తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది. ప్రధాని మోదీ సౌదీ పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. అందుకే మోదీ విమానానికి అనుమతి నిరాకరిస్తునట్లు పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి నిరాకరణ విషయాన్ని భారత […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:51 am, Mon, 28 October 19
పాక్ బుద్ధి ఇంకా మారలేదు.. ప్రధాని మోదీ విమానానికి నో ఎంట్రీ

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రపంచానికి మరోసారి చూపించుకుంటోంది. తమ గగన తలం మీది నుంచి భారత ప్రధాని విమానం వెళ్లేందుకు అనుమతిని నిరాకరిస్తూ..తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది. ప్రధాని మోదీ సౌదీ పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. అందుకే మోదీ విమానానికి అనుమతి నిరాకరిస్తునట్లు పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి నిరాకరణ విషయాన్ని భారత హైకమిషనర్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నట్లు ఖురేషి ప్రకటించారు.

ఇవాళ మోదీ సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరమ్‌లో పాల్గొనడంతో పాటు.. సౌదీ నేతలతో భేటీ కానున్నారు. కాగా, గత నెల అమెరికా పర్యటన సందర్భంలోనూ పాక్‌ తమ గగనతలం నుంచి ప్రధాని మోదీ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరించింది. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐస్‌ల్యాండ్‌ పర్యటన సమయంలోనూ ఇదే విధంగా వ్యవహరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత.. కొద్దికాలం పాక్ గగనతలాన్ని మూసేసి.. ఆ తర్వాత తెరిచింది. అయితే తాజాగా జమ్ముకశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ఆ దేశం మళ్లీ భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసింది.