AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ రక్షణ శాఖ వెబ్‌సైట్లపై పాక్ సైబర్ దాడి..

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. రక్షణ సంస్థ వర్గాల సమాచారం ప్రకారం... సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని, వారి లాగిన్ ఆధారాలు టార్గెట్‌గా సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

భారత్ రక్షణ శాఖ వెబ్‌సైట్లపై పాక్ సైబర్ దాడి..
Pak Cyber Attack
Ram Naramaneni
|

Updated on: May 05, 2025 | 5:16 PM

Share

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. భారత్ చర్యలతో లోలోపల వణికిపోతుంది. తమకు అలవాటైన దొడ్డి దార్ల గుండా భారత్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా పాకిస్తాన్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని, వారి లాగిన్‌లు.. టార్గెట్‌గా పాక్  సంబంధిత గ్రూపులు సైబర్ దాడి చేసినట్లు తెలుస్తోంది.

మన మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు సంబంధించిన సున్నితమైన డేటాను హ్యాకర్లు పొందినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ కు చెందిన X హ్యాండిల్‌లో పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్  చేయడానికి ప్రయత్నించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హ్యాకింగ్ ప్రయత్నం వల్ల ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది అంచనా వేయడానికి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను పూర్తి ఆడిట్ కోసం ఆఫ్‌లైన్‌లో ఉంచినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న సంస్థలు లేదా వ్యక్తులు స్పాన్సర్ చేసే సైబర్ దాడులను గుర్తించడానికి.. ఎక్స్‌పర్ట్స్ సైబర్‌స్పేస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. ఇతర హ్యాకింగ్ ప్రయత్నాల నుండి రక్షణ కల్పించడానికి భద్రతను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఎక్స్ హ్యాండిల్‌లో ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన ఒక వెబ్‌పేజీ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో, ఒక భారతీయ ట్యాంక్ స్థానంలో ఒక పాకిస్తాన్ ట్యాంక్ ఉంది. మరొక పోస్ట్‌లో భారత రక్షణ సిబ్బంది పేర్ల లిస్ట్ ఉంది. “హ్యాక్ అయింది. మీ భద్రత అనేది ఒక భ్రమ. MES డేటా వారి సొంతం” అనే సందేశం ఉంది. మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్‌సైట్‌లోని 1,600 మంది వినియోగదారుల 10 GB కంటే ఎక్కువ డేటాను యాక్సెస్ చేసినట్లు ఆ హ్యాండిల్ పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరీని దారుణంగా కాల్చి చంపిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దారుణమైన దాడికి బాధ్యత వహించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..