Oxford 2020 Hindi Word : ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్న ప్రధాని మోదీ చెప్పిన పదం..
ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ 2020గా 'ఆత్మనిర్భరత' పదం నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది విశేషంగా ఉపయోగించిన 'అత్మనిర్భరత' పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకుంది.
Oxford 2020 Hindi Word : ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ 2020గా ‘ఆత్మనిర్భరత’ పదం నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది విశేషంగా ఉపయోగించిన ‘అత్మనిర్భరత’ పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా మారుమోగిన ఈ పదం.. హిందీ వర్డ్ ఆఫ్ ఇయర్-2020గా నిలిచింది.
గతేడాది ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన సమయంలో ప్రధాని మోదీ ఈ పదం ఉపయోగించారు. కోవిడ్ వైరస్‌పై కోట్లాదిమంది భారతీయుల విజయానికి ఈ పదం ప్రామాణికంగా నిలిచినట్లు ఆక్స్ఫర్డ్ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ ఆత్మనిర్భర్ భారత్ ఆవశ్యకతను వెల్లడించారు. అప్పటి నుంచి ఈ పదం వాడకం విపరీతంగా పెరిగింది.
స్వావలంబనను సూచించే ‘అత్మనిర్భరత’ పదం ఆక్స్ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ 2020గా నిలిచింది. కోట్లాది భారతీయులు కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు ఈ పదం ప్రమాణికంగా నిలిచినట్లు ఆక్స్ఫర్డ్ పేర్కొంది. గతేడాది అధికంగా ఈ పదాన్నే ఉపయోగించినట్లు తెలిపింది. అందుకే తమ భాషా నిపుణుల సలహా కమిటీలోని సభ్యులు కృతిక అగర్వాల్, పూనమ్ నిగం సహాయ్, ఇమోగెన్ ఫోక్సెల్ ఈ పదాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ ఆత్శనిర్భర్ భారత్ ఆవశ్యకతను తెలియజేశారు. మహమ్మారిని జయించేందుకు ఒక దేశంగా, ఆర్థిక వ్యవస్థగా, సమాజంగా, వ్యక్తులుగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతోనే స్వదేశంలోనే రెండు కరోనా వ్యాక్సిన్లను విజయవంతంగా అభివృద్ధి చేశారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..