మరో కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ సర్కార్.. ఇకపై, ఆ ఫినైల్‌తోనే కార్యాలయాలు శుభ్రం చేయాలంటూ ఉత్తర్వులు

ఇకపై, ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ఆవు మూత్రంతో చేసిన ఫినైల్‌తోనే శుభ్రం చేయాల్సి ఉంటుంది.

మరో కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ సర్కార్.. ఇకపై, ఆ ఫినైల్‌తోనే కార్యాలయాలు శుభ్రం చేయాలంటూ ఉత్తర్వులు
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 02, 2021 | 8:42 PM

cow urine phenyl in MP : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌ను వాడాలంటూ తాజాగా అర్డర్స్ ఇచ్చింది. ఇకపై, ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ఆవు మూత్రంతో చేసిన ఫినైల్‌తోనే శుభ్రం చేయాల్సి ఉంటుంది. అఫీసులను క్లీన్ చేయడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆవు మూత్ర తయారైన ఫినైల్‌నే వాడాలంటూ రాష్ట్ర సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (జీఏడీ) శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేసింది.

అయితే, ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ స్పందించారు. ఆవు మూత్రం బాట్లింగ్ ప్లాంట్ ఏర్పాటును ప్రోత్సహించడం, ఆవు ఫినైల్ కర్మాగారాలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించేందుకే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారడంతో.. నెటిజెన్లు ట్రోల్‌ చేస్తూ ఆనందం పొందారు.అయితే, ప్రైవేటు కంపెనీలు తయారుచేసే ఫినైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

ఇదిలావుంటే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆశ్రమాల్లోని 1,80,000 ఆవులను మేపడానికి రూ.11 కోట్లు కేటాయించింది. భారతదేశం మొట్టమొదటి ఆవు అభయారణ్యం 2017 లో మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వాలో స్థాపించారు. 472 హెక్టార్లలో విస్తరించి ఉన్న కామధేను గౌ అభ్యారణ్‌లో 6,000 ఆవులను పూర్తి సామర్థ్యంతో ఉంచే కెపాసిటి కలిగిఉన్నది. అయితే, ఆర్థిక సంక్షోభం కారణంగా దీనిని ప్రభుత్వం ప్రైవేటీకరించింది.

Read Also…  జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం… ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న కేంద్ర హోంశాఖ

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..