క్రిప్టో కరెన్సీపై తేల్చి చెప్పిన కేంద్ర ఆర్థికశాఖ.. సొంతంగా క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని వెల్లడి

క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. సొంతంగా క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో శివసేన సభ్యుడు సంజయ్‌రౌత్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ లిఖితపూర్వక..

క్రిప్టో కరెన్సీపై తేల్చి చెప్పిన కేంద్ర ఆర్థికశాఖ.. సొంతంగా క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని వెల్లడి
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 03, 2021 | 5:17 PM

Own Cryptocurrency :  క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. సొంతంగా క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో శివసేన సభ్యుడు సంజయ్‌రౌత్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు‌. క్రిప్టోకరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా- లీగల్‌ టెండర్‌గా పరిగణించబోమని 2018-19 బడ్జెట్‌ ప్రసంగంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు.

చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపు వ్యవస్థల నుంచి క్రిప్టోకరెన్సీ వినియోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దేశంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి ‘బ్లాక్‌చైన్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటామన్నారు.

కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాదానంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్లు దూకుడు పెంచాయి.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..