AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Sisodia: మనీష్ సిసోడియా మెడ పట్టుకొని లాక్కెల్లిన పోలీసులు.. వైరలవుతున్న వీడియో

ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పర్చిన సమయంలో.. సిసోడియాను పోలీసులు మెడ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Manish Sisodia: మనీష్ సిసోడియా మెడ పట్టుకొని లాక్కెల్లిన పోలీసులు.. వైరలవుతున్న వీడియో
Manish Sisodia
Follow us
Aravind B

|

Updated on: May 24, 2023 | 4:48 AM

ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పర్చిన సమయంలో.. సిసోడియాను పోలీసులు మెడ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అరవింద్ కెజ్రీవల్ పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే వీడియోను గమనిస్తే ఢిల్లీ కోర్టుకు భారీ భద్రత నడుమ సిసోడియాను పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మీడియా వారి వద్దకు చేరుకొని ప్రశ్నలు అడగుతుండగా ఓ పోలీస్‌ అధికారి ఏకే సింగ్‌ రిపోర్టర్లను దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ పోలీస్ సిసోడియాను మాట్లాడనివ్వకుండా మెడ పట్టుకొని తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మనీష్ సిసోడియాతో ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇలా చేయమని పైనుంచి పోలీసులకు ఆదేశాలొచ్చాయా? అని మండిపడ్డారు. మనీష్ పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన షాక్‌కు గురిచేసిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి అన్నారు. సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆప్‌ చేసిన ఆరోపణలను ఢిల్లీ పోలీస్‌లు ఖండించారు. ఇదంతా దుష్ప్రచారంగా వ్యాఖ్యానించారు. వీడియోలో కనిపిస్తున్న పోలీసుల చర్య భద్రత దృష్ట్యా సహజమేనని.. నిందితులు ఎవరైనా మీడియాకు స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం చట్టవిరుద్ధమని పోలీసులు ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి సిసోడియాను పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. అయితే రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు జూన్ 1వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం