AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిల్లర విషయంలో తలెత్తిన వివాదం.. రైల్వే ఉద్యోగికి ప్రయాణికుడు ఊహించని షాక్..

రైల్వే స్టేషన్‌లో చిల్లర విషయంలో ప్రయాణికుడు, ప్యాంట్రీ కారు ఉద్యోగి మధ్య చిన్నగా మొదలైన గోడవ ఆ ఉద్యోగి అరెస్ట్ వరకు దారి తీసింది. ఈ ఘటన షోరనూర్ రైల్వే పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. ఇంతకు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది. ఆ ఉద్యోగిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకుందాం పదండి.

చిల్లర విషయంలో తలెత్తిన వివాదం.. రైల్వే ఉద్యోగికి ప్రయాణికుడు ఊహించని షాక్..
భారతీయ రైల్వేల్లో రోజూ లక్షలాది మంది జనాలు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా రైల్వే టికెట్‌ బుకింగ్‌లో మార్పులు తీసుకొచ్చింది.
Anand T
|

Updated on: Nov 08, 2025 | 6:27 PM

Share

చిల్లర విషయంలో జరిగిన గొడవలో ప్రయాణీకుడిపై వేడి వేడి నీరు పోసినందుకు ప్యాంట్రీ కార్ ఉద్యోగిని అరెస్టైన ఘటన తిరువనంతపురం వెళ్తున్న నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. నేత్రావతి ట్రైన్‌లో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల ముంబైకి చెందిన అభిషేక్ బాబుపై దాడి చేసిన కారణంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాంట్రీ కార్ ఉద్యోగి రాఘవేంద్ర సింగ్‌ను షోరనూర్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అభిషేక్ బాబు తన స్నేహితులతో కలిసి త్రిస్సూర్‌లోని మరో స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కాడు. అయితే రాత్రిపూట అభిషేక్ దగ్గర ఉన్న బాటిల్‌లో వాటర్ అయిపోవడంతో, అతను మరో బాటిల్ కొనడానికి పాంట్రీ కారు వద్దకు వెళ్లాడు. అయితే బాటిల్‌ కోసం అభిషేక్ రూ.200 నోట్‌ ఇవ్వగా చిల్లర లేదని రూ.15 చిల్ల ఇవ్వాలని ప్యాంట్రీ కారు ఉద్యోగి కోరారు.

వారు కూడా చిల్లర లేదనడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. కాసేపటి తర్వాత అభిషేక్ అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లి తమ సీట్లలో వాళ్లు కూర్చున్నారు. అయితే బాటిల్‌ కోసం వచ్చిన అభిషేక్ ప్యాంట్రీ కార్‌ వద్దే తమ తమ అద్దాలు, క్యాప్‌ను మర్చిపోయి వెళ్లారు. దీంతో అవి తీసుకునేందుకు మళ్లీ అక్కడికి వెళ్లారు. అయితే వాటిన ఉదయం ఇస్తానని ప్యాంట్రీ కార్ ఉద్యోగి చెప్పాడు. ఉదయం మళ్లీ వెళ్లి అడినప్పుడు ఆ ఉద్యోగి గ్లాసెస్‌, క్యాప్ తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మరోసారి ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.

దీంతో రెచ్చిపోయిన పాంట్రీ కార్ ఉద్యోగి రాగేంద్ర తన దగ్గర స్టీల్ బకెట్‌లో ఉన్న వేడివేడి నీటి అభిషేక్, అతని ఫ్రెండ్స్ పై పోశాడు. దీంతో వారు ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి పాంట్రీ కార్ ఉద్యోగిని అరెస్టు చేశారు. ఉద్యోగి దాడిలో అభిషేక్ బాబు వీపు, కాళ్ళపై కాలిన గాయాలు అయ్యాయి. అతను త్రిస్సూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?