Safety Pin: ఓర్ని ఇదేందిరా సామీ.. ఈ సేఫ్టీ పిన్ ఇంత కాస్టా.. కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!
మన భారతీయ మహిళలు సేఫ్టీ పిన్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. సాధారణంగా ఒక సేఫ్టీ పిన్ ధర ఎంత ఉంటుంది రూ.10 లేదా 20 కానీ ఇప్పుడు చెట్టబోయే ఒక సేఫ్టీ పిన్ ధర తెలిస్తే మీరు నొరెళ్లబెట్టాల్సిందే.. ఎందుకంటే ఆ ఒక్క సేఫ్టీ పిన్ ధర అక్షరాలా రూ.69,000. అవును వినడానికి నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.. ఇంతకు దీనికి ఎందుకు ఇంత ధర.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పదండి.

మన భారతీయ మహిళల్లో ప్రతి ఒక్కరూ సేఫ్టీ పిన్‌లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. ముఖ్యంగా, చీరలు కట్టుకునేప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అలాగే అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా వాటిని తమ బ్యాగుల్లో క్యారీ చేస్తారు. సాధారణంగా, దీని ధర రూ. 10-20 వరకు ఉంటుంది. కానీ తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన ఒక సేఫ్టీ పిన్ ధర తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ప్రాడా అనే కంపెనీ తయారు చేసిన ఈ పిన్ ధర అక్షరాల రూ. 69,000. అవును, ఇది వినడానికి వింతగా అనిపించినా నిజం.
ఇంతకు ఈ సేఫ్టీ పిన్‌కు ఇంత ధర ఎందుకు.. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రాడా కంపెనీ సేఫ్టీ పిన్ ఒక పైకప్పును ఒక దారంతో అందంగా డిజైన్ చేసింది. అలాగే దీనికి చిన్న సంతకం లోగో కూడా ఉంది. ప్రాడా తయారు చేసిన ఈ సేఫ్టీ పిన్‌ను ప్రమోట్ చేస్తూ ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఈ సేఫ్టీ పిన్ ధరను 775 డాలర్లుగా పేర్కొంది. అంటే, మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 69 వేలు. దీంతో ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
View this post on Instagram
ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఖరీదైన ధరకు ఈ సేఫ్టీ పిన్‌ను ఎవరు కొంటారు?” అని చాలా మంది వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రాడా అనేది 1913లో మారియో ప్రాడా స్థాపించిన ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది బ్యాగులు, బూట్లు మరియు ఫ్యాషన్ ఉపకరణాలను విక్రయిస్తుంది. ఇది అంతర్జాతీయ బ్రాండ్ కాబట్టి, దాని ఉత్పత్తులు కూడా ఖరీదైనవి
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
