బాబోయ్.. ఇదో బ్యూటిఫుల్ సైలెంట్ కిల్లర్.. కనిపించే లోపుగానే కథ ముగించేస్తుంది..!
సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో పాముల వీడియోలు చూడా చాలా ఉంటాయి. కానీ, ఇక్కడ రంగు రంగులతో ఉన్న ఒక అందమైన పాము వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ముద్దుగా ఉందని దగ్గరికెళితే మాత్రం మీ లైఫ్‌కి ఎండ్ కార్డ్ గ్యారెంటీ అంటున్నారు. ఒక్క చుక్క విషంతో అమాంతంగా..

boomslang Snake Video: ప్రపంచంలో చాలా విషపూరిత పాములు ఉన్నాయి. ఒక్క కాటుతో అమాంతం ప్రాణాలు హరించేస్తాయి. వాటి విషం అంత ప్రమాదకరమైనది. అందుకే పాములను చూడగానే ప్రజలు భయపడతారు. ఇంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాము వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ పాము ఆఫ్రికాలోనే అత్యంత విషపూరితమైనగా చెబుతారు. దీని పేరు బూమ్స్‌లాంగ్. ఈ పాము రంగురంగులతో చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ దాని విషం ఒక్క చుక్క చాలు ఎంతటి మనిషినైనా నిలువునా కూల్చేస్తుంది.
వైరల్ వీడియోలో ఒక పాము చెట్టు చుట్టూ చుట్టుకుని తన వేటను నిశితంగా గమనిస్తూ కనిపిస్తుంది. దూరం నుండి చూస్తే, అది చెట్టు కొమ్మలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చెట్లలాగా ప్రత్యేకంగా రంగులో ఉంటుంది. అందువల్ల, ఇది చెట్టు రంగుతో కలిసిపోతుంది. దీనిని గుర్తించడం కష్టం. ఆఫ్రికాలో ఈ పామును “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. అందుకే ప్రజలు దానిని చూడగానే పారిపోతారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాము వీడియో చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.
ఆఫ్రికాలోని అత్యంత విషపూరితమైన పాము వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Jimmyy__02 అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు. “సైలెంట్ కిల్లర్‌ని కలవండి.. నెమ్మదిగా, ఖచ్చితంగా చంపుతుంది. ఆఫ్రికాలోని అత్యంత విషపూరితమైన పాము ఇది అనే క్యాప్షన్‌తో దీన్ని షేర్ చేశారు. 14 సెకన్ల వీడియోను 15,000 ల మందికి పైగా చూశారు.. వందలాది మంది వివిధ రకాలుగా కామెంట్ చేశారు. వందల సంఖ్యలో లైక్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
मिलिए Silent Assassin से धीमा ज़रूर पर मौत पक्की, अफ्रीका का सबसे ज़हरीला साँप !! pic.twitter.com/f8o3nSmwyV
— JIMMY (@Jimmyy__02) November 5, 2025
ఈ పాము గురించి ఒక యూజర్ గ్రోక్ ని అడిగినప్పుడు, ఇది బూమ్స్ లాంగ్ పాము అని, ఇది చాలా విషపూరితమైన ఆఫ్రికన్ పాము అని గ్రోక్ వివరించాడు. ఈ పాములు చెట్లపై నివసిస్తాయి. వాటి విషం నెమ్మదిగా పనిచేస్తుంది. కాటు వేసిన కొన్ని గంటల తర్వాత రక్తస్రావం, వికారం, బహుశా మరణం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పాము ఆఫ్రికాలో చాలా మరణాలకు కారణమవుతుంది. అయితే, దీనికి యాంటీవీనమ్‌తో చికిత్స చేయవచ్చునని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




