Viral Video: పులితో వేట అమ్మాయితో ఆట అంత ఈజీ కాదు డ్యూడ్… పుష్ అప్స్ పోటీలో యువకుడిని మట్టికరిపించిన యువతి
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అని ఓ సినీ కవి రాశాడు. ఇప్పుడు ఆ పాటను మార్చి రాసుకునే రోజులొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో చూశాక...

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అని ఓ సినీ కవి రాశాడు. ఇప్పుడు ఆ పాటను మార్చి రాసుకునే రోజులొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్ని ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లంటే పుష్ అప్స్ పోటీలు అని రాసుకోవాల్సిందే. ఓ పెళ్లిలో జరిగిన పుష్ ఆప్స్ పోటీలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
వీడియోలో పెళ్లి సందడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వధువు తరపువారు, వరుడి తరపు వారు ఒక్కదగ్గర చేరి తెగ సందడి చేస్తున్నారు. అయితే నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీఖా కోహ్లీ వధువు తరపున ఆ పెళ్లిలో తెగ సందడి చేస్తుంది. వధువు కాలేజీ ఫ్రెండ్ కావడంతో పెళ్లికి వస్తుంది. ఈ క్రమంలో వరుడి తరపు వారితో ఓ పందెం మొదలవుతుంది. సోషల్ మీడియాలో ఫిట్నెస్ వీడియోలతో ఫేమస్ అయిన కోహ్లీతో పోటీ పడాలని వరుడి తరపువారు ఆసక్తి కనబరుస్తారు. ఇంతలో ఓ యువకుడు ముందుకొస్తాడు.
ఇంకేముంది ఇరువురి బంధుమిత్రుల చప్పట్ల మధ్య పోటీ ప్రారంభవుతుంది. ఇద్దరు తొలుత ఉత్సాహంగా పుష్ అప్స్ ప్రారంభిస్తారు. కాసేపయ్యాక యువకుడు ఆలసిపోయినట్లు కనిపిస్తాడు. ఇంతలో శ్రీఖా కోహ్లీ కూడా ఇక చాలన్నట్లుగా ఉంటుంది. కానీ ఎవరూ తగ్గేదేలె అన్నట్లుగా పుష్ అప్స్ ఇస్తూనే ఉంటారు. బంధు మిత్రులు మాత్రం చప్పట్లతో వారిని ఉత్సాహపరుస్తుంటారు. కెమెరామెన్ తన కెమెరాలో ఈ తతంగమంతా బంధిస్తుంటారు. ఇంతలో యువకుడు ఆలసిపోయి కుప్పకూలుతాడు. నీదే విజయం అంటూ కోహ్లీని అభినందస్తాడు. దీంతో కోహ్లీ గర్వంగా నవ్వుకుంటుంది. ఇంతటితో వీడియో ముగుస్తుంది.
వీడియో చూడండి:
View this post on Instagram
వీడియో నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
