AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ చెవుల ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

మన చేతి రేఖలు చూసి మన వ్యక్తిత్వ రహస్యాలు, స్వభావాన్ని ఎలాగైతే తెలుసుకుంటారో.. మన శరీరంలోని వివిధ అవయవాలైన చేతి వేళ్లు, ముక్కు, పాదాలు, చెవుల ఆకారాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. కాబట్టి ఇప్పుడు చెవుల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వ రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

Personality Test: మీ చెవుల ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
Personality Test
Anand T
|

Updated on: Nov 06, 2025 | 6:15 PM

Share

సాధారణంగా, ఒక వ్యక్తి భవిష్యత్తు, స్వభావాన్ని హస్తసాముద్రికం, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. దీనితో పాటు, ఒక వ్యక్తి రహస్య స్వభావాన్ని అతని జుట్టు, పాదాలు, వేళ్లు, ముక్కు ఆకారం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ భూమ్మీద జన్మించే ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం ఎలా బిన్నంగా ఉంటుందో అతని శరీర ఆకారం కూడా అలానే భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, కొంతమందికి పెద్ద చెవులు ఉంటాయి, మరికొందరికి చిన్న చెవులు ఉంటాయి. ఈ చెవి ఆకారం బట్టి అతని ఎలాంటి వాడనేది తెలుసుకోవచ్చు.

మీ చెవులు ఇలా ఉన్నాయా?.. అయితే ఇదే మీ వ్యక్తిత్వం

పెద్ద చెవులు: మీ చెవులు పెద్దవిగా ఉంటే, మీరు ప్రశాంతంగా, విశాల దృక్పథంతో ఉంటారని అర్థం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా, మీరు ప్రశాంతంగా ఉంటారు. అలాగే మీరు ఎల్లప్పుడుగా ధైర్యంగా ఉండటం వల్ల, మీరు జీవితాన్ని ఒక ఉత్తేజకరమైన సాహసంగా చూస్తారు. మీరు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కాబట్టి నిజం చెప్పడానికి అస్సలు వెనకాడరు. అలాగే ఎట్టిపరిస్థితుల్లో అబద్దాలు చెప్పాలనుకోరు. మీరు జీవితంలోని ప్రతి అంశాన్ని ఉత్సాహంతో అంగీకరిస్తారు. మీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటారు. మీరు గతం, వర్తమానం గురించి ఆలోచించరు..ప్రస్తుత పరిస్థితులను ఆంగీకరిస్తూ ముందుకు సాగుతారు.

చిన్న చెవులు: మీ చెవులు చిన్నగా ఉంటే, మీరు ఆలోచనాత్మకమైన, సంయమనం పాటించే వ్యక్తి అని అర్థం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు మీరు మిమ్మల్ని ప్రభావితం చేసే చాన్స్‌ ఇతరులకు అస్సలు ఇవ్వరు. మీరు చాలా సిగ్గుపడేవారు, మీరు కొత్త వ్యక్తులతో సులభంగా కలిసిపోరు. మీరు క్రమశిక్షణ గల జీవితాన్ని గడుపుతారు. ఎల్లప్పుడూ మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు. మీరు గాసిప్‌లో పాల్గొనడానికి బదులుగా అర్థవంతమైన సంభాషణలను మాత్రమే ఇష్టపడతారు. అలాగే, మీరు ప్రశాంతమైన, హాయిగా ఉండే వాతావరణంలో ఉండాలని కోరుకుంటారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.