Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockdown : మే 2 తరువాత ఏ రోజైనా దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌ డౌన్‌ ప్రకటన ? మోదీ వరుస మీటింగుల సారాంశమిదేనా.?

Nationwide corona Lockdown : భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ కేంద్రం దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి...

Lockdown : మే 2 తరువాత ఏ రోజైనా దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌ డౌన్‌ ప్రకటన ? మోదీ వరుస మీటింగుల సారాంశమిదేనా.?
Lockdown
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 24, 2021 | 5:02 PM

Nationwide corona Lockdown : భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ కేంద్రం దేశవ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. మే 2 తరువాత ఏ రోజైనా లాక్ డౌన్ ప్రకటన రావొచ్చు. ప్రధాని నరేంద్రమోదీ గత నాలుగురోజులుగా వరుస భేటీల సారాంశమిదే.. ఇవీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్న ఊహాగానాలు. భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు తప్పక దాపురిస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ మరింత బలంగా మారుతుందంటున్న వైద్య నిఫుణుల మాటలూ లాక్ డౌన్ విధింపు రూమర్లకు బలం చేకూరుస్తోంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల కరోనా విషయానికి వస్తే, ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ ఉందని నిర్ధారణ చేసినట్టు సమాచారం. చాలా వేగంగా వ్యాప్తి చెందే దక్షిణాఫ్రికా రకం వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోవైపు హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి. ఇక, దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 63 శాతం కేసులు ఉండటం గమనార్హం. అటు, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో కూడా కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా నైట్ కర్ఫ్యూ లు అమలు చేస్తుండగా, స్వచ్ఛందంగా గ్రామాల్లో కూడా లాక్ డౌన్ విధించుకుంటున్నారు జనం. మే 2వ తేదీన పూర్తి కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే దేశంలోని పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మే, జూన్ నెలలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున.. సుమారు 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చనున్నట్టు కేంద్రం నిన్న ప్రకటించడం కూడా దేశ వ్యాప్త లాక్‌ డౌన్‌ కోసమేనని ప్రచారం జోరుగా సాగుతోంది.

Read also : Weather : ఆంధ్రప్రదేశ్, యానంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన.. సముద్రమట్టంకు 0.9 కి. మీ. ఎత్తున ద్రోణి