AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather : ఆంధ్రప్రదేశ్, యానంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన.. సముద్రమట్టంకు 0.9 కి. మీ. ఎత్తున ద్రోణి

Weather report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియచేశారు...

Weather  : ఆంధ్రప్రదేశ్, యానంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన.. సముద్రమట్టంకు 0.9  కి. మీ. ఎత్తున ద్రోణి
Weather
Venkata Narayana
|

Updated on: Apr 24, 2021 | 4:21 PM

Share

Weather report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియచేశారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు.. ఎల్లుండి, ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి, ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, రేపు.. ఎల్లుండి ప్రధానంగా సీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇలాఉండగా, ఉత్తర – దక్షిణ ద్రోణి.. మరట్వాడా నుండి, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ , రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం వరకు వ్యాపించి సముద్ర మట్టంనకు 0.9 కి. మీ. ఎత్తున ఉంది. దక్షిణ ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల్లో, సముద్ర మట్టానికి 1.5km ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది.

Read also : Vijayawada Covid : బతికున్నారో లేదో తెలీని పరిస్థితి, కుటుంబ సభ్యులకు నో ఇన్ఫర్మేషన్, మార్చరీలో పేరుకుపొతోన్న మృతదేహాలు

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి