AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSLV F16 Nisar: జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్‌ షురూ… రేపు శ్రీహరికోట నుంచి ప్రయోగం

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్‌ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్‌ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు...

GSLV F16 Nisar: జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్‌ షురూ... రేపు శ్రీహరికోట నుంచి ప్రయోగం
Satish Dhawan Space Centre
K Sammaiah
|

Updated on: Jul 29, 2025 | 7:23 AM

Share

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్‌ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్‌ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూ పరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి.

నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది L -బ్యాండ్, S-బ్యాండ్ SAR టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌‎ను భూమికి పంపించనుంది. నిసార్‌కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫొటోలను తీసే సామర్థ్యం ఉంది.

ఉపగ్రహ స్కాన్లు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, నేల తేమ, వ్యవసాయ నమూనాలలో మార్పులను ట్రాక్ చేయడంలో నిసార్‌ సాయపడనుంది. తీరప్రాంతం, కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అధిక రెజల్యూషన్ ఫొటోలు, డేటా అందించడం నిసార్ ప్రత్యేకత. నిసార్‌ సేవలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. నిసార్‌ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్‌ చేయగలదని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

‘నిసార్‌ ఉపగ్రహంలో ఎస్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఎల్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ను నాసా రూపొందించింది. నిసార్‌ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలూ స్పష్టమైన ఫొటోలు తీసి భూమికి పంపగలదు. మట్టి పెళ్లలు విరిగిపడటం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదు.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ