అక్కడ రాళ్లు విసురుకోవడమే ఆచారం.. గాయాలపాలైన 168 మంది

అక్కడ రాళ్లు విసురుకోవడమే ఆచారం.. గాయాలపాలైన 168 మంది

మధ్యప్రదేశ్‌లో ఆచారంగా వస్తున్న గోట్‌మర్ ఉత్సవాల్లో దాదాపు 168 గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని చింధ్వారాలలో శనివారం జరిగిన ఈ ఉత్సవాల్లో స్ధానిక పందుర్నా, షవర్గావ్ గ్రామాల ప్రజలు జామ్ నదీ సమీపంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. శతాబ్దాల కిందటి ఆచారంగా వస్తున్న ఈ గోట్మార్ పండుగలో  ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకుంటారు. ఇలా రాళ్ల విసురుకోవడంతో  వందలకొద్దీ భక్తులు ఇరువైపులా రక్తమోడుతూ కనిపిస్తారు. ఈ రాళ్లు విసురుకోవడమనే ఆచారం  తమకు పూర్వంకాలంనుంచి  ఉన్నదని  ఈ రెండు గ్రామాల ప్రజలు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 01, 2019 | 3:48 PM

మధ్యప్రదేశ్‌లో ఆచారంగా వస్తున్న గోట్‌మర్ ఉత్సవాల్లో దాదాపు 168 గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని చింధ్వారాలలో శనివారం జరిగిన ఈ ఉత్సవాల్లో స్ధానిక పందుర్నా, షవర్గావ్ గ్రామాల ప్రజలు జామ్ నదీ సమీపంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. శతాబ్దాల కిందటి ఆచారంగా వస్తున్న ఈ గోట్మార్ పండుగలో  ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకుంటారు. ఇలా రాళ్ల విసురుకోవడంతో  వందలకొద్దీ భక్తులు ఇరువైపులా రక్తమోడుతూ కనిపిస్తారు. ఈ రాళ్లు విసురుకోవడమనే ఆచారం  తమకు పూర్వంకాలంనుంచి  ఉన్నదని  ఈ రెండు గ్రామాల ప్రజలు చెబుతారు.

శనివారం జరిగిన గోట్మార్ ఉత్సవాల్లో పందుర్నా, షవర్గావ్ గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు విసురుకోవడంతో దాదారు 168 మంది తీవ్రంగా గాయపడ్డారు వీరిని వెంటనే హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చింద్వారా జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ గాయపడ్డవారిని వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించామని తెలిపారు. ఈ వేడుకలకు భారీగా పోలీసు బలగాలను తరలించినట్టు చెప్పారు. అదే విధంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని కూడా చెప్పారు.

తెలుగురాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆచారాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో కొట్టుకుంటారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల యుద్ధం జరుపుతారు. కర్నూలు జిల్లా లోదే. వీపనగండ్లలో దసరా ఉత్సవాల సమయంలోనే ఊరివాసులు రాళ్ల యుద్ధానికి దిగుతారు. విజయదశమి రోజున సాయంత్రం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూ ఇటూ చేరి కంకర రాళ్లను గుట్టలుగా పోసుకుని వాటిని విసురుకుంటారు. మరో ప్రాంతంలో కొబ్బరి కాయలు భక్తుల తలపై పగులగొట్టించుకుంటారు. రక్తం ధారగా కారుతున్నప్పటికీ ఇది తమ ఆచారంగా భక్తులు పేర్కొనడం గమనార్హం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu