ఇకపై గోవులు మాత్రమే జన్మించేలా తయారీ కేంద్రాలు : కేంద్రమంత్రి గిరిరాజ్
రానున్న రోజుల్లో కేవలం గోవులు మాత్రమే జన్మించే విధంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర పశు సంవర్ధక శాఖామంత్రి గిరిరాజ్ సింగ్. మహారాష్ట్ర నాగపూర్‌లో శనివారం జరిగిన పాల ఉత్పత్తుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మంత్రి గిరిరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీని ఉపయోగించి కేవలం గోవులు మాత్రమే జన్మించేలా ప్రత్యేక తయారీ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పారు. ఈ ఏడాది 30 లక్షల డోసుల సెమెన్‌ను […]
రానున్న రోజుల్లో కేవలం గోవులు మాత్రమే జన్మించే విధంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర పశు సంవర్ధక శాఖామంత్రి గిరిరాజ్ సింగ్. మహారాష్ట్ర నాగపూర్‌లో శనివారం జరిగిన పాల ఉత్పత్తుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మంత్రి గిరిరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో సెక్స్ సార్టెడ్ సెమెన్ టెక్నాలజీని ఉపయోగించి కేవలం గోవులు మాత్రమే జన్మించేలా ప్రత్యేక తయారీ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పారు.
ఈ ఏడాది 30 లక్షల డోసుల సెమెన్‌ను సేకరించినట్టు తెలిపారు. దీని ద్వారా 2025 నాటికి 10 కోట్ల గోవులకు జన్మించేందుకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి గోవు దాదాపు 20 లీటర్ల పాలు ఇచ్చే విధంగా ఐవీఎఫ్ టెక్నాలజీని కూడా ఉపయోగించబోతున్నట్టు మంత్రి గిరిరాజ్ చెప్పారు.