గవర్నర్ల మార్పు.. ‘ లా ‘ ఏం చెబుతోంది ?

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Sep 01, 2019 | 6:03 PM

కేంద్రం తాజాగా అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు నూతన గవర్నర్లు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ల నియామకం, వారి బదిలీ లేదా వారి మార్పుపై చట్టం ఏం చెబుతోంది ? ఈ అంశంపై వివిధ కమిషన్లు, చేసిన సిఫారసులేమిటి అన్న విషయాన్ని ప్రస్తావించుకోవలసిందే. రాజ్యాంగం లోని ఆర్టికల్ 155, 156 ప్రకారం కేంద్రం సిఫారసుపై రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు […]

గవర్నర్ల మార్పు.. ' లా ' ఏం చెబుతోంది ?

కేంద్రం తాజాగా అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు నూతన గవర్నర్లు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అసలు గవర్నర్ల నియామకం, వారి బదిలీ లేదా వారి మార్పుపై చట్టం ఏం చెబుతోంది ? ఈ అంశంపై వివిధ కమిషన్లు, చేసిన సిఫారసులేమిటి అన్న విషయాన్ని ప్రస్తావించుకోవలసిందే. రాజ్యాంగం లోని ఆర్టికల్ 155, 156 ప్రకారం కేంద్రం సిఫారసుపై రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది.

అవసరమైతే వీరి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. రాజ్యాంగం లోని 74 అధికరణం కింద కేంద్రానికి ఒక గవర్నర్ ను తొలగించడానికి. లేదా నియమించడానికి అధికారం ఉంటుంది. 2010 లో బీపీ సింఘాల్ వర్సెస్ భారత ప్రభుత్వానికి మధ్య కొనసాగిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఆ కేసులో కొత్తగా ఎన్నికైన ‘ కేంద్ర ప్రభుత్వం ‘ యూపీ, గుజరాత్, హర్యానా, గోవా గవర్నర్లను తొలగించింది. ఈ తొలగింపును సవాలు చేస్తూ ఓ కేసు దాఖలయింది. అయితే ఆ సందర్భంలో కేసు ప్రభుత్వమే గెలిచింది. గవర్నర్ల తొలగింపు లేదా నియామకానికి సంబంధించి అధికారం రాష్ట్రపతికి, కేంద్రానికి ఉంటుందని కోర్టు రాజ్యాంగాన్ని ఉదహరిస్తూ స్పష్టం చేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఏ సమయంలో నైనా, ఏ కారణం చేతనైనా ఎలాంటి వాదనకూ అవకాశం ఇవ్వకుండా గవర్నర్లను వీరు తొలగించవచ్ఛు ..లేదా బదిలీ చేయవచ్చు అన్నదే ఆ ఉత్తర్వుల్లోని ప్రధానాంశం. అయితే నిరంకుశంగా, అకారణంగా గవర్నర్లను తొలగించిన సందర్భాలు లేవు. 1998 లో సర్కారియా కమిషన్, 2002 లో వెంకటాచలయ్య కమిషన్, 2010 లో పంచీ కమిషన్ దాదాపు ఒకే విధమైన సిఫారసులు చేశాయి. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఇవి ఉన్నాయి. కానీ ఈ సిఫారసులను పార్లమెంటు చట్టంగా చేయకపోవడం విశేషం. అందువల్లే వీటికి ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ తొమ్మిదేళ్లకు పైగా వ్యవహరించారు. ఎప్పటికప్పుడు ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగిస్తూ వచ్చింది. ముగ్గురు ముఖ్యమంత్రుల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటికే ఆయన బదిలీ తథ్యమని చాలా సార్లు వార్తలు వఛ్చినప్పటికీ కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వఛ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.అయితే ఈ మధ్యే ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం తాజాగా తెలంగాణా గవర్నర్ మార్పుపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న సౌందరరాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu