బ్యాంకులు విలీనంతో ఉద్యోగాలు పోవు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని బెంగ పట్టుకుంది. అయితే ఉద్యోగులకు ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలిగించబోరని మంత్రి తెలిపారు. బ్యాంకుల విలీనంతో తమ ఉద్యోగాలకే నష్టం ఏర్పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పీఎస్‌యూ బ్యాంకుల విలీనం […]
బ్యాంకుల విలీనంతో ఆయా బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని బెంగ పట్టుకుంది. అయితే ఉద్యోగులకు ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలిగించబోరని మంత్రి తెలిపారు. బ్యాంకుల విలీనంతో తమ ఉద్యోగాలకే నష్టం ఏర్పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పీఎస్‌యూ బ్యాంకుల విలీనం ద్వారా మార్గం ఏర్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12 పటిష్ట బ్యాంకులుగా మారుస్తామని శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ ఉద్యోగాలు పోతాయంటూ బ్యాంకు ఉద్యోగులంతా శనివారం ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. మరోవైపు ఈ చర్యవల్ల బ్యాంకుల మూసివేతకు ఇది దారితీస్తుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగులకు ఎలాంటి భయాలు అవసరం లేదని మంత్రి చెప్పారు.