దేశంలో అందరికీ నచ్చింది.. కానీ రాహుల్‌కి నచ్చలేదు : హోం మంత్రి అమిత్‌షా
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దాద్రా నగర్ హవేలీలోని సిల్వస్సాలో జరిగిన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్‌పై ఫైర్ అయ్యారు. ఇప్పటికీ రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ఇష్టం లేదని, ఆయన భారత్ వైపు కాకుండ పాకిస్తాన్‌కు మద్దతిస్తూ మాట్లాడుతూనే ఉన్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పటికీ పాక్‌ను […]
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దాద్రా నగర్ హవేలీలోని సిల్వస్సాలో జరిగిన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్‌పై ఫైర్ అయ్యారు.
ఇప్పటికీ రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ఇష్టం లేదని, ఆయన భారత్ వైపు కాకుండ పాకిస్తాన్‌కు మద్దతిస్తూ మాట్లాడుతూనే ఉన్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పటికీ పాక్‌ను పొగుడుతూ ఆ దేశానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారని, కశ్మీర్ విషయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని పాక్ మానవ హక్కుల మంత్రి షైరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాసారని అమిత్‌షా మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో అభివృద్ధికి తలుపులు తెరుచుకున్నాయని , కేంద్రం తీసుకున్న నిర్ణయంతో టెర్రరిజం కూడా తగ్గుతుందని తెలిపారు హోం మంత్రి.. దేశ ప్రజలంతా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే కొంతమందికి ఇది నచ్చడం లేదంటూ ఎద్దేవా చేశారు.