బండారు దత్తాత్రేయ.. ఎ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ !
హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజకీయ జీవితంలో ఓ ఘటన ‘ మాయని మచ్ఛ ‘ గా మిగిలింది. నిరాడంబరుడు, స్నేహశీలి, సౌమ్యుడుగా పేరు పడి, అందరూ ఆప్యాయంగా ‘ దత్తన్న ‘ గా పిలుచుకునే ఈయన పొలిటికల్ కెరీర్ ఒక దశలో ‘ మసక బారింది ‘. ఒక్కసారి బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్తే..అది 2016 వ సంవత్సరం.. నాడు కేంద్ర […]
హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజకీయ జీవితంలో ఓ ఘటన ‘ మాయని మచ్ఛ ‘ గా మిగిలింది. నిరాడంబరుడు, స్నేహశీలి, సౌమ్యుడుగా పేరు పడి, అందరూ ఆప్యాయంగా ‘ దత్తన్న ‘ గా పిలుచుకునే ఈయన పొలిటికల్ కెరీర్ ఒక దశలో ‘ మసక బారింది ‘. ఒక్కసారి బ్యాక్ గ్రౌండ్ లోకి వెళ్తే..అది 2016 వ సంవత్సరం.. నాడు కేంద్ర మంత్రిగా ఉన్నారు బండారు దత్తాత్రేయ. అప్పట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనలో కొంతమంది దళిత విద్యార్థులు.. ఇందుకు దత్తాత్రేయే కారణమని, రోహిత్ సూసైడ్ చేసుకునేలా ఆయనే ప్రేరేపించారని ఆరోపించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖాకీలు దత్తాత్రేయ పైన, అప్పటి ఈ యూనివర్సిటీ వీసీ అప్పారావుపైనా కేసు పెట్టారు. వారిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ వివాదంలోకి తన పేరు రావడంతో దత్తాత్రేయ..
నాటి మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈ యూనివర్సిటీ .. కుల రాజకీయాలు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారిందని, క్యాంపస్ లో విద్యార్థుల మధ్య గొడవలు, డ్రగ్స్ వినియోగం జరుగుతున్నాయని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఒకసారి ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆయన కోరారు. అయితే దత్తాత్రేయ రాజకీయ ప్రయోజనాలకోసమే ఈ లేఖ రాశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విద్యార్థుల మధ్య రేగిన గొడవను ఆయన తన రాజకీయ లబ్దికోసం వినియోగించుకోజూస్తున్నారని ఆరోపించాయి. పార్లమెంటులో కాంగ్రెస్ తదితర విపక్షాలు స్మృతి ఇరానీపై సభా హక్కుల తీర్మానానికి నోటీసునిచ్చాయి. అయితే ఇందులో దత్తాత్రేయ ప్రమేయమేమీ లేదని స్మృతి సభకు స్పష్టం చేశారు.
కాగా-సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దత్తాత్రేయ నాలుగు సార్లు గెలిచినప్పటికీ.. ఆయన విజయం దేశంలో బీజేపీ అనుకూల పవనాలవల్లేనని ప్రచారం జరిగింది. ప్రతిసారీ .. అంటే 1991 లో రామ మందిర సమస్య సమయంలోను, 1998.. 99 లో దివంగత ప్రధాని వాజ్ పేయి ఆధ్వర్యాన కమలం పార్టీ విజయసాధనలోను, 2014 లో నరేంద్ర మోదీ స్వీప్ సందర్భంలో సైతం దత్తాత్రేయ ‘ విజయ సారధుడయ్యారు ‘ కానీ.. మిగిలిన ఎన్నికల్లో చాలా సార్లు ఆయన కాంగ్రెస్ చేతిలో ఓటమి చవి చూస్తూ వచ్చారు. ఇదిలాఉండగా..దసరా వంటి పండుగల సందర్భంలో బండారు దత్తాత్రేయ.. ‘ ఆత్మీయ సమ్మేళనం ‘ (అలయ్..బలయ్..) పేరిట అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించి వారిని హగ్ చేసుకోవడం ద్వారా తన స్నేహభావాన్ని, తాను రాజకీయనేతనైనప్పటికీ.. పార్టీలకు అతీతుడనని నిరూపించుకుంటున్నారు.