ఒక ‘టీ’ యాడ్.. మత విద్వేషాలను రెచ్చగొడుతుందా..!

ఒక 'టీ' యాడ్.. మత విద్వేషాలను రెచ్చగొడుతుందా..!

హిందుస్థాన్ యూనీలీవర్ తయారీ సంస్థ తాజాగా వారి టీ ప్రోడక్ట్ రెడ్ లేబిల్ పై చిత్రీకరించిన ఓ ప్రకటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. టీ ఉత్పత్తులకు ఎంతో ప్రసిద్ధి చెందిన హిందుస్థాన్ సంస్థ.. గణేష్ చతుర్థి ఆధారంగా విడుదల చేసిన తాజా యాడ్‌పై ట్విట్టర్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకటనపై విశ్లేషణకు వస్తే… వినాయక చవితి రానుండటంతో ఓ హిందూ వ్యక్తి గణపతి విగ్రహం కోసం షాప్‌కు వెళ్లగా.. అక్కడ విగ్రహాలను తయారు […]

Ravi Kiran

|

Sep 01, 2019 | 3:03 PM

హిందుస్థాన్ యూనీలీవర్ తయారీ సంస్థ తాజాగా వారి టీ ప్రోడక్ట్ రెడ్ లేబిల్ పై చిత్రీకరించిన ఓ ప్రకటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. టీ ఉత్పత్తులకు ఎంతో ప్రసిద్ధి చెందిన హిందుస్థాన్ సంస్థ.. గణేష్ చతుర్థి ఆధారంగా విడుదల చేసిన తాజా యాడ్‌పై ట్విట్టర్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రకటనపై విశ్లేషణకు వస్తే…

వినాయక చవితి రానుండటంతో ఓ హిందూ వ్యక్తి గణపతి విగ్రహం కోసం షాప్‌కు వెళ్లగా.. అక్కడ విగ్రహాలను తయారు చేసే వ్యక్తి ముస్లిం కావడంతో కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తాడు. ఇక ఈ విషయంపై ప్రస్తావిస్తూ..  కొందరు నెటిజన్లు ఈ ప్రకటన ముస్లింల పట్ల హిందువులకు ఉన్న భయాన్ని చూపిస్తూ.. వాళ్ళను తక్కువ చేస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా యాడ్ చూపించిన మాదిరిగా ఏ ఒక్క హిందువు.. గణపతి విగ్రహాన్ని ముస్లిం నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు అలా భయపడడని చెబుతున్నారు. ప్రకటనలో చూపించింది వట్టి అభూత కల్పన మాత్రమే అని వారు ధ్వజమెత్తారు. మరోవైపు ఇంకొందరైతే.. యాడ్ మేకర్స్ తమ క్రియేటివిటీకి పదును పెట్టి.. మతాన్ని అడ్డుపెట్టుకోకుండా ప్రకటనలు రూపొందించాలని  హితవు పలికారు.

ట్విట్టర్‌లో #BoycottRedLabel హ్యాష్‌ట్యాగ్ వైరల్…

రెడ్ లేబల్‌పై ‘వార్’కు సిద్దమైన నెటిజన్లు ట్విట్టర్‌లో #BoycottRedLabel అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న ప్రకటనను వెంటనే తొలగించి.. క్షమాపణలు చెప్పాలని హెచ్చరిస్తున్నారు.

ప్రకటనతో మతవిద్వేషాలు రెచ్చగొడతారా…

రెడ్ లేబల్ తాజా ప్రకటనను చూస్తే.. హిందువులు.. ముస్లింల పేర్లు విన్నా.. చూసినా చాలా భయపడతారన్నట్లుగా చిత్రీకరించారు. కానీ వాస్తవానికి వారు అలా ఉండరు. ఎప్పుడూ కూడా రెండు మతాల వారు సోదరుల మాదిరిగానే ఉండాలని భావిస్తారు తప్ప మతవిద్వేషాలు రెచ్చగొట్టుకోరు. ఇండియా హమారా దేశ్.. హిందూ ముస్లిం భాయ్ భాయ్.. అనే ఈ నినాదం ప్రతి భారతీయుడికి తెలిసిందే. ఏ ఒక్కరూ కూడా విప్లవాలను సృష్టించుకోరు.

నార్త్ ఇండియాలో పెద్ద పండగ.. ‘గణేష్ చతుర్థి’

సౌత్ రాష్ట్రాల కంటే నార్త్ ఇండియాలోనే వినాయక చవితిని ఎక్కువగా జరుపుకుంటారు. అదీ కూడా ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే ఈ పండగ వాతావరణం వీర లెవెల్‌లో ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వినాయకుడి ఆశీస్సులు లేకుండా పని చేయరు. ఈ యాడ్ వల్ల అలాంటి పండగ వాతావరణం నాడు మత విద్వేషాలు చెలరేగుతాయనే భయం కొంతమంది ఆస్తికుల్లో వ్యక్తం కావడం సహజమే. కానీ కల్పితమైన ఓ ప్రకటన వల్ల గొడవలు జరుగుతాయని అనుకోవడం కరెక్ట్ కాదని అందరి భావన.

ఏది ఏమైనా సినిమా వాళ్ళు గానీ.. ప్రకటన కర్తల గానీ ఎక్కువగా మతాన్ని ఉద్దేశించే ప్రస్తావిస్తారు. ఇకనైనా ఆ పంథాను వదిలేసి.. వేరే మార్గంలో ప్రకటనలను రూపొందిస్తే  బాగుంటుందన్నది ప్రజల భావన.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu