వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం  విఫలం: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఇటీవల వచ్చిన వరదలను ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా నిర్లక్యం చేసిందని బాబు ఆలేఖలో పేర్కొన్నారు. తీవ్రంగా నష్టపోయిన బాధితులను తక్షణం ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లంక గ్రామాల పరిస్థితి మారీ దారుణంగా ఉందని..వారి పరిస్థితి చూసి తాను కలత చెందినట్టుగా చంద్రబాబు చెప్పారు. ఈ వరదల ఎఫెక్ట్‌తో అరటి, పసుపు, కంద, […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Sep 01, 2019 | 4:01 PM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఇటీవల వచ్చిన వరదలను ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా నిర్లక్యం చేసిందని బాబు ఆలేఖలో పేర్కొన్నారు. తీవ్రంగా నష్టపోయిన బాధితులను తక్షణం ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లంక గ్రామాల పరిస్థితి మారీ దారుణంగా ఉందని..వారి పరిస్థితి చూసి తాను కలత చెందినట్టుగా చంద్రబాబు చెప్పారు.

ఈ వరదల ఎఫెక్ట్‌తో అరటి, పసుపు, కంద, తమలపాకు, మొక్కజొన్న, వరి, చెరకు పంటలు నీట ముగినిపోయాయని, వీటిని సాగుచేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల ప్రజల ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో గోదావరి వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్‌కు చంద్రబాబు విఙ్ఞప్తి చేశారు. వరద నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్రానికి పంపాలన్నారు. అదే విధంగా విజయవాడలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రక్షణ గోడ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రక‌ృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో మాన్యువల్స్‌ను ప్రభుత్వం అధ్యయనం చేయాలని చంద్రబాబు సీఎం జగన్‌కు సూచించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu