కశ్మీర్ పై మోదీ వ్యూహం ఇమ్రాన్ కు తెలుసు.. రేహమ్ ఖాన్

కశ్మీర్ పై మోదీ వ్యూహం ఇమ్రాన్ కు తెలుసు..  రేహమ్ ఖాన్

కశ్మీర్ పై ప్రధాని మోదీ వ్యూహమేమిటో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తెలుసునని ఆయన (ఇమ్రాన్) మాజీ భార్య రేహమ్ ఖాన్ సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్ పై వారిద్దరి మధ్యా డీల్ కుదిరిందని, నిజానికి ఆ రాష్ట్రం ‘ అమ్ముడు పోయిందని ‘ ఆమె వ్యాఖ్యానించింది.’ మొదటి నుంచీ నేనిదే చెబుతున్నా.. కశ్మీర్ పాకిస్తాన్ అవుతుందని అంటూ వచ్చా .. ‘ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ […]

Anil kumar poka

|

Sep 01, 2019 | 4:39 PM

కశ్మీర్ పై ప్రధాని మోదీ వ్యూహమేమిటో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తెలుసునని ఆయన (ఇమ్రాన్) మాజీ భార్య రేహమ్ ఖాన్ సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్ పై వారిద్దరి మధ్యా డీల్ కుదిరిందని, నిజానికి ఆ రాష్ట్రం ‘ అమ్ముడు పోయిందని ‘ ఆమె వ్యాఖ్యానించింది.’ మొదటి నుంచీ నేనిదే చెబుతున్నా.. కశ్మీర్ పాకిస్తాన్ అవుతుందని అంటూ వచ్చా .. ‘ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ వైరల్ అయింది. మోదీ తాను అనుకున్నది సాధించారని, ఆర్టికల్ 370 ని రద్దు చేశారని ఆమె తెలిపింది. ఆ మధ్య బిషక్ లో జరిగిన సమ్మిట్ లో ఇమ్రాన్.. మోదీని కలిసిన సందర్భంలో.. మోదీ ఉద్దేశమేమిటో తెలుసుకున్నారని, ఇమ్రాన్ తో ఆయన దురుసుగా మాట్లాడారని రేహమ్ ఖాన్ తెలిపింది. ‘ మరి మీకు ముందే ఈ విషయం తెలిసినప్పుడు మోదీకి స్నేహ హస్తం ఎందుకు చాచారు ? ‘ అని ఆమె ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించింది. లిబియాలో పుట్టి.. బ్రిటిష్-పాక్ జర్నలిస్టుగా మారిన రేహమ్ ఖాన్.. ఇమ్రాన్ ను బలహీనుడని, కశ్మీర్ పరిణామాల అనంతరం మరింత శక్తిహీనుడయ్యాడని దుయ్యబట్టింది. మోదీతో ఆయన డీల్ కుదుర్చుకున్న ఫలితంగానే కాశ్మీర్లో ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయని, భారత ప్రధానిని సంతోషపెట్టడానికే ఇమ్రాన్ యత్నిస్తున్నాడని ఆమె పేర్కొంది.లోగడ ఇమ్రాన్ రెండో భార్యగా ఈమె సుమారు 10 నెలలు కాపురం చేసింది. అయితే ఆయన లైంగికంగా వేధించేవాడని, ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డాడని ఈమె తన ఆటోబయాగ్రఫీ పుస్తకంలో ఆరోపించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu