AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ ‘ పెద్ద మనసు ‘.ఫెడరల్ జడ్జిగా ఇండో-అమెరికన్ లాయర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండో-అమెరికన్ లాయర్ అయిన షిరీన్ మ్యాథ్యూస్ ను ఫెడరల్ జడ్జిగా నియమించారు. వైట్ కాలర్ నేరాల దర్యాప్తులో స్పెషలిస్ట్ అయిన ఈమె.. జోన్స్ డే అనే న్యాయ సంస్థకు భాగస్వామిగా ఉన్నారు. గతంలో ఈమె కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. క్రిమినల్ హెల్త్ కేర్ ఫ్రాడ్ కేసులను విచారించేవారు. శాన్ డీగో లో సదర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో షిరీన్ జడ్జిగా పదవి చేపట్టడానికి సిధ్ధంగా ఉన్నారని ట్రంప్ […]

ట్రంప్ ' పెద్ద మనసు '.ఫెడరల్ జడ్జిగా ఇండో-అమెరికన్ లాయర్
Anil kumar poka
|

Updated on: Sep 01, 2019 | 12:33 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండో-అమెరికన్ లాయర్ అయిన షిరీన్ మ్యాథ్యూస్ ను ఫెడరల్ జడ్జిగా నియమించారు. వైట్ కాలర్ నేరాల దర్యాప్తులో స్పెషలిస్ట్ అయిన ఈమె.. జోన్స్ డే అనే న్యాయ సంస్థకు భాగస్వామిగా ఉన్నారు. గతంలో ఈమె కాలిఫోర్నియాలో అసిస్టెంట్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. క్రిమినల్ హెల్త్ కేర్ ఫ్రాడ్ కేసులను విచారించేవారు. శాన్ డీగో లో సదర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో షిరీన్ జడ్జిగా పదవి చేపట్టడానికి సిధ్ధంగా ఉన్నారని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈమె నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. వివిధ స్థాయుల్లో ఫెడరల్ జుడీషియరీకి నామినేట్ అయిన ఇండో-అమెరికన్లలో ఈమె ఆరోవారు. ఆమె నియామకం చరిత్రాత్మకమని సౌత్ ఏషియా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనీష్ అభివర్ణించారు. ఆమె అపాయింట్ మెంట్ ను సెనేట్ వెంటనే ఆమోదించాలని ఆయన కోరారు. ప్రాసిక్యూటర్ గా ఉండగా షిరీన్.. చోరీ అయిన వైద్య పరికరాలకు సంబంధించి జరిగిన కోట్లాది డాలర్ల ఫ్రాడ్ ను దర్యాప్తు చేశారు. సోషల్ సెక్యూరిటీ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసిన అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ట్రంప్ ఇటీవల నియోమీ రావు, థాపర్, డయానే గుజరాతీ, అనురాగ్ సింఘాల్ లను జడ్జీలుగా నియమించారు.

Follow Us
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!
Zudio బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుంది? బిజినెస్‌ సీక్రెట్!
స్కూల్ ప్రిన్సిపల్‌ హత్య కేసులో ట్విస్ట్.. చంపింది విద్యార్థులే
స్కూల్ ప్రిన్సిపల్‌ హత్య కేసులో ట్విస్ట్.. చంపింది విద్యార్థులే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? లాభాలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? లాభాలు
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. కొత్త ఫీచర్..!
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది?
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
ఆగస్టు 19 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు..
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
రతన్ టాటా లేదా నోయెల్ టాటా కాదు..టాటా గ్రూప్‌కు అసలు యజమాని ఎవరు?
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్
భర్తతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్