కత్తితో చంపేస్తా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్
జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సహా.. ఆయన మంత్రులు నిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు భారత్‌లో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు కూడా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు ఇమ్రాన్ మంత్రి వర్గం మాత్రమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి పాకిస్థాన్ […]
జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సహా.. ఆయన మంత్రులు నిత్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు భారత్‌లో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు కూడా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు ఇమ్రాన్ మంత్రి వర్గం మాత్రమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్, జావిద్ మియాందాద్ కూడా ఎంటర్ అయ్యారు.
కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. “కశ్మీర్ సోదరులారా భయపడకండి. నేను మీకు తోడుగా ఉంటాను. గ్రౌండ్‌లో బ్యాట్ పట్టుకుని సిక్సులు బాదిన వాడిని.. తల్వార్‌తో మనిషుల్ని చంపలేనా.. ” అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై భారత నెటిజన్లు మియాందాద్‌కు తమదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు.
కాగా, ఇప్పటికే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మరో పాక్ క్రికెటర్ అఫ్రీదీ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే అతనికి ధీటుగా భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాదు కశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య అక్టోబర్‌లో భీకర యుద్ధం జరుగుతుందని పాక్ మంత్రి వ్యాఖ్యానించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా.. పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఇదే అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Former Pakistan cricketer Javed Miandad threatening India while holding a sword: Pehle main balle se chakka marta tha, ab talwar se insaan maaronga (If I can hit six with a bat, why can’t I swing sword.. I used to hit sixes with bat, now I’ll kill humans with sword)… pic.twitter.com/blmK1XnbKS
— Navneet Mundhra (@navneet_mundhra) September 1, 2019