మరోసారి నోరు పారేసుకున్న దిగ్విజయ్ సింగ్

తరచు ఎదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతారు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. తాజాగా మరోసారి ఆయన నోటికి పనిచెప్పారు. ఈ సారి మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసి.. మరో వివాదానికి తెరలేపాడు. బీజేపీ, భజరంగ్ దళ్ సంస్థలు పాకిస్థాన్ గూఢాచారి సంస్థలైన ఐఎస్ఐ వంటి వాటి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు దీనిపై అందరూ దృష్టిసారించాలని కోరారు. ముస్లింల కంటే… ముస్లింలు కాని వారే ISI తరఫున […]

మరోసారి నోరు పారేసుకున్న దిగ్విజయ్ సింగ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Sep 01, 2019 | 5:26 PM

తరచు ఎదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతారు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. తాజాగా మరోసారి ఆయన నోటికి పనిచెప్పారు. ఈ సారి మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసి.. మరో వివాదానికి తెరలేపాడు. బీజేపీ, భజరంగ్ దళ్ సంస్థలు పాకిస్థాన్ గూఢాచారి సంస్థలైన ఐఎస్ఐ వంటి వాటి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు దీనిపై అందరూ దృష్టిసారించాలని కోరారు. ముస్లింల కంటే… ముస్లింలు కాని వారే ISI తరఫున గూఢచారులుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయం అందరికీ అర్థం కావాల్సి ఉందన్నారు దిగ్విజయ్ సింగ్.

అయితే బీజేపీపై దిగ్విజయ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు మాత్రం ఆయన హిందూ దేవాలయాలను సందర్శించడం, ఆర్ఎస్ఎస్ సంస్థకు మద్దతుగా మాట్లాడటం జరిగింది. అయితే బోపాల్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి సాద్వి ప్రజ్ఞా సింగ్‌పై ఓటమిపాలయ్యారు.