అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెడుతున్న గృహలక్ష్మి పథకం.. నాకంటే నాకంటూ కొట్లాటలు

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న గృహలక్ష్మీ అనే పథకం అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెడుతోంది. ఈ పథకానికి నేనంటే నేను అర్హురాలినని అత్తాకోడళ్లు కోట్లాడుకుంటున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ పథకం అమలులో అత్తాకోడళ్ల మధ్య ప్రభుత్వం ఎవరికి ప్రాధాన్యం ఇవ్వనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెడుతున్న గృహలక్ష్మి పథకం.. నాకంటే నాకంటూ కొట్లాటలు
Money
Follow us
Aravind B

|

Updated on: Jun 01, 2023 | 4:41 PM

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న గృహలక్ష్మీ అనే పథకం అత్తాకోడళ్ల మధ్య చిచ్చు పెడుతోంది. ఈ పథకానికి నేనంటే నేను అర్హురాలినని అత్తాకోడళ్లు కోట్లాడుకుంటున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ పథకం అమలులో అత్తాకోడళ్ల మధ్య ప్రభుత్వం ఎవరికి ప్రాధాన్యం ఇవ్వనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు తమ మేమిఫెస్టోలో ఈ గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంలోని ఓ మహిళకు నెల నెలా రూ.2 వేలు అందజేయనున్నట్లు వెల్లడించింది. కుటుబంలో ఒక మహిళకే ఇది వర్తించడంతో పలుచోట్ల అత్తాకోడళ్ల మధ్య తగాదాలు మొదలయ్యాయి.

అలాగే ఈ పథానికి ఎవరు లబ్దిదారులు అనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించకపోవడం వల్లే ఈ వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఈ అంశంపై కర్నాటక శిశు, మహిళా శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బల్కర్‌ స్పందించారు. గృహలక్ష్మీ పథకం కింద అందించే మొత్తాన్ని ఎవరు తీసుకోవాలనేది కుటుంబ సభ్యులదే అంతిమ నిర్ణయం అని తెలిపింది. అయితే భారతీయ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో మహిళా పెద్దగా అత్తగారు వ్యవహరిస్తారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే నగదు ఆమెకే చెందాలని తెలిపారు. కావాలంటే ఆమె తన కోడలుకు ఈ డబ్బులు ఇచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలోనే కేబినెట్ సమావేశం జరగనుందని దీనిపై మరింత స్పష్టత వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి