Major Tragedy in UP:అయోధ్యలో ఘోర ప్రమాదం.. సరయునదిలో గల్లంతైన 15మంది.. 9మందిని రక్షించిన సిబ్బంది
Major Tragedy in UP: ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నదిలోకి స్నానం చేయడానికి వెళ్లిన కొందరు.. సాయం అందించడానికి ప్రయత్నించిన మరికొందరు నీటిలో మునిపోయారు..
Major Tragedy in UP: ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. నదిలోకి స్నానం చేయడానికి వెళ్లిన కొందరు.. సాయం అందించడానికి ప్రయత్నించిన మరికొందరు నీటిలో మునిపోయారు. వివరాల్లోకి వెళ్తే..
రామ జన్మభూమి అయోధ్యను సందర్శించడానికి కొంతమంది భక్త బృందం వచ్చారు. ఈ నేపథ్యంలో ఓ కుటుంబం సరయూ నదిలోని గుప్తర్ ఘాట్ వద్దకు వెళ్లారు. వారిలో కొంతమంది నదిలో దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నది నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నదిలోకి దిగిన కొంత మంది కొట్టుకుని పోయారు. ఇది ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు గమనించి ప్రవాహంలో కొట్టుకుపోతున్నవారికి సాయం అందించడానికి.. ప్రయత్నించారు. దీంతో వారిలో కూడా కొందరు నీట మునిగారు. దీంతో పోలీసులు సహాయక బృందం రంగంలోకి దిగింది.
ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 15మంది నీట మునిగారని.. వారిలో 9మందిని రక్షించామని పోలీసులు చెప్పారు. వీరంతా అగ్రానుంచి వచ్చినట్లు తెలిపారు. రక్షించిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీప ఆసపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నీటిలో మునిగిన మరో ఆరుగురి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గత ఈతగాళ్లు వారికోసం వెదుకుతున్నారు.
Also Read: ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఈదురు గాలులు