Pragya Singh Thakur: డ్యాన్స్‌ వేస్తూ హల్‌చల్ చేసిన ప్రగ్యా ఠాకూర్‌.. వాయింపు మొదలెట్టిన కాంగ్రెస్

కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌..వీడియోలు ఇటీవల వైరలవుతున్నాయి. కొంతకాలం క్రితం బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియో వైరల్ అయ్యింది.

Pragya Singh Thakur: డ్యాన్స్‌ వేస్తూ హల్‌చల్ చేసిన ప్రగ్యా ఠాకూర్‌.. వాయింపు మొదలెట్టిన కాంగ్రెస్
Pragya Singh Thakur
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 09, 2021 | 6:31 PM

కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌..వీడియోలు ఇటీవల వైరలవుతున్నాయి. కొంతకాలం క్రితం బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియో వైరల్ అయ్యింది. తాజాగా, ఓ పెళ్లికి హాజరైన ఎంపీ.. ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో బయటకు వచ్చింది. భోపాల్‌లో ఇద్దరు పేద యువతుల పెళ్లిళ్లకు హాజరైన ప్రగ్యా ఠాకూర్‌.. అప్పగింతల సమయంలో డీజే పెట్టించారు. అతిథులతో పాటు తాను సైతం స్టెప్పులేశారు. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్‌ఛైర్‌లోనే కన్పించే ఆమె..ఒక్కసారిగా బాస్కెట్‌బాల్ ఆడటం, డ్యాన్సులు చేస్తుండటం చూసి కొందరు షాక్‌కు గురవుతున్నారు. ఇక కాంగ్రెస్‌ ఐతే ఈ వీడియోలపై సెటైర్లు వేస్తోంది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేనని చెబుతున్న ఎంపీ.. ఇలా డ్యాన్స్‌లు చేయడం, బాస్కెట్‌బాల్ ఆడటం చాలా సంతోషంగా ఉందంటూ చురకలంటించారు. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రగ్యా ఠాకూర్‌.. కోర్టు విచారణకు హాజరుకావడానికి అనారోగ్య కారణాలను సాకుగా చూపుతుంటారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోందంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రగ్యా ఠాకూర్ వచ్చి, ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ యువతులు. ఎంపీ సహాయం చేసుండకపోతే తమ కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగేవి కావని.. ప్రగ్యా ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రగ్యా ఠాకూర్‌ డ్యాన్స్ చేసిన వీడియో దిగువన చూడండి..

Also Read: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. మొదటి దశలో 50,000 ఉద్యోగాల భర్తీ

క్రికెట్ ఆడిన సీఎం జగన్.. క్లాసీ షాట్స్‌‌తో కరేజ్ చూపించారు.. క్లాప్స్ కొట్టించారు

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..