Coronavirus: కరోనా హబ్‌గా వృద్ధాశ్రమం.. 67 మందికి పాజిటివ్.. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటన..
Old Age Home: దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే.. దేశంలో
Old Age Home: దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే.. దేశంలో కరోనా కట్టడిలో ఉన్నప్పటికీ.. మళ్లీ కొన్ని ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. ఇటీవల ఓ వైద్య కళాశాలలోని దాదాపు 250 మందికిపైగా విద్యార్థులకు కరోనా సోకింది. తాజాగా మహారాష్ట్రలోని థానేలోని ఓ వృద్ధాశ్రమం కూడా కరోనా హబ్‌గా మారింది. వృద్ధాశ్రమంలోని 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. థానే భివండీ సార్గావ్ ప్రాంతంలోని మాతోశ్రీ వృద్ధాశ్రమంలోని కొందరు మహిళలు అస్వస్థతతకు గురయ్యారు. దీంతో నిర్వాహకులు సమాచారంతో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ ఆశ్రమంలోని 109 మందికి పరీక్షలు నిర్వహించగా.. 67 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే.. కరోనా సోకిన వారంతా రెండు డోసుల టీకా తీసుకున్నారని తెలిపారు. పూర్తిగా కరోనా టీకా తీసుకున్న వారికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.
కోవిడ్ నిర్ధారణ అయిన వారిలో 62 మంది వృద్ధులు ఉండగా.. ఐదుగురు వృద్ధాశ్రమంలో పనిచేసే సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని.. కానీ వారంతా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. బాధితులందరినీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు థానే వైద్యాధికారి డాక్టర్ మనీశ్ రెంగే వెల్లడించారు. కాగా.. 15 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు తెలిపారు. వాటి నివేదికలు రెండు రోజుల్లో వస్తాయని తెలిపారు.
ఈ ఘటన అనంతరం సార్గావ్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. స్థానికులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కాగా.. ఈ ప్రాంతంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
Also Read: