AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Power Play: మహారాష్ట్ర రాజకీయాల్లో కట్టప్పలు.. వెన్నుపోటు కుట్రలతో పార్టీలు చీలికలు పేలికలు.. !

ముఖ్యంగా ఒకే కుటుంబం చేతిలో నడిచే రాజకీయ పార్టీల్లో ఈ తరహా వెన్నుపోటు రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత కుటుంబ సభ్యులు లేదంటే బాగా నమ్మిన అనుచరులే వెన్నుపోటు కట్టప్పలుగా మారుతున్నారు. బాల్ థాకరే 1966లో ఏర్పాటు చేసిన శివసేన, ఆయన బ్రతికున్నంతకాలం మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన మరణానంతరం వారసత్వాన్ని కొనసాగించే విషయంలో రాజ్ థాకరే, ఉద్ధత్ థాకరే మధ్య విబేధాలు కుటుంబ రాజకీయాల్లో చీలిక తీసుకొచ్చింది.

Maharashtra Power Play: మహారాష్ట్ర రాజకీయాల్లో కట్టప్పలు.. వెన్నుపోటు కుట్రలతో పార్టీలు చీలికలు పేలికలు.. !
అజిత్ పవార్‌ను కట్టప్పగా పేర్కొంటూ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ముంబైలో ఏర్పాటు చేసిన పోస్టర్
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Jul 06, 2023 | 6:45 PM

Share

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పార్టీల్లో చీలికలు, నేతల వెన్నుపోట్లు రాజకీయాల్లో కొత్తేమీ కానప్పటికీ బాహుబలి సినిమా కథను తలపించేలా రాజకీయ పార్టీల్లో కట్టప్పలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలను కలవరపెడుతున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబం చేతిలో నడిచే రాజకీయ పార్టీల్లో ఈ తరహా వెన్నుపోటు రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత కుటుంబ సభ్యులు లేదంటే బాగా నమ్మిన అనుచరులే వెన్నుపోటు కట్టప్పలుగా మారుతున్నారు. బాల్ థాకరే 1966లో ఏర్పాటు చేసిన శివసేన, ఆయన బ్రతికున్నంతకాలం మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన మరణానంతరం వారసత్వాన్ని కొనసాగించే విషయంలో రాజ్ థాకరే, ఉద్ధత్ థాకరే మధ్య విబేధాలు కుటుంబ రాజకీయాల్లో చీలిక తీసుకొచ్చింది. అలా రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పేరుతో వేరు కుంపటి పెట్టారు. ఉద్ధవ్ థాకరే చేతిలో ఉన్న శివసేనలోనూ ఏక్‌నాథ్ షిండే రూపంలో కట్టప్ప బయటపడగా.. ఇప్పుడు అదే రాష్ట్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు సొంత కుటుంబ సభ్యుడైన అజిత్ పవార్ రూపంలో కట్టప్ప ఎదురయ్యారు. శివసేన కట్టప్ప ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగా.. ఎన్సీపీ కట్టప్పకు ఉప ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అజిత్ పవార్‌ను కట్టప్పగా చిత్రీకరిస్తూ శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ముంబైలో పోస్టర్లను ఏర్పాటు చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. కాగా అజిత్ పవార్ కట్టప్పగా మారగానే సరిపోదు.. పార్టీ తనదే అని నిరూపించుకోడానికి తగిన సంఖ్యాబలాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా వ్యవహరించాలి. లేదంటే అనర్హత వేటుకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు.

అజిత్‌ పవార్ బలమెంత?

అసెంబ్లీ 53 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీలో తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చాటుకుంటూ పార్టీని చీల్చి ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్.. ఇప్పుడు అనర్హత వేటు ప్రమాదం లేకుండా పార్టీ ఎన్నికల గుర్తు నిలబెట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఏ పార్టీలోనైనా 2/3 (మూడింట రెండొంతులు) సంఖ్యాబలం ఉంటే ఆ చీలిక వర్గమే అసలైన పార్టీగా గుర్తింపు పొందుతుంది. ఈ లెక్కన 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో అజిత్ పవార్ కనీసం 36 మంది మద్దతు కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఆయన వెంట ఉన్నది 32 మందిగా లెక్క తేలింది. మరో నలుగురు ఉంటే తప్ప 2/3 మెజారిటీ సాధించలేరు. వ్యూహాత్మకంగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అఫిడవిట్లు తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద తమదే అసలైన ఎన్సీపీ అంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. శివసేన చీలిక సమయంలో అసలు గుర్తును ఏక్‌నాథ్ షిండేకు కేటాయించిన సందర్భంగా పరిగణలోకి తీసుకున్న అంశాలు, లెక్కల ప్రకారం అజిత్ పవార్‌ ఎన్సీపీ ఎన్నికల గుర్తును కైవసం చేసుకోగలరని అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి
Sharad Pawar And Ajit Pawar Maharashtra Politics

Sharad Pawar And Ajit Pawar 

చట్టం ఏం చెబుతోంది?

రాజకీయ పార్టీల్లో చీలికలు ఏర్పడ్డప్పుడు వాటిలో ఏది అసలు వర్గమో, ఏది చీలిక వర్గమో చెప్పేందుకు రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తితే, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వర్తిస్తుంది. సభలో 2/3 మెజారిటీ ఎవరికి ఉంటే వారిదే అసలైన పార్టీగా స్పీకర్ గుర్తించాల్సి ఉంటుంది. అయితే నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్లు ఈ రోజుల్లో అధికార పార్టీకే కొమ్ముకాస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు పార్టీలో చీలిక ఏర్పడితే.. ఏ వర్గానిది అస‌లు పార్టీ అన్నది కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యిస్తుంది. 1968 నాటి ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ మరియు కేటాయింపు) ఆర్డర్లోని 15వ పేరా ప్రకారం ఎన్నికల సంఘానికి ఈ అధికారం దఖలు పడింది. ఎన్నికల కమిషన్ విచారణ జరిపి అటు శాసన సభలో, ఇటు పార్టీలో ఎవరి బలం ఎంత అన్నది లెక్కించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో చీలికకు ముందు పార్టీ టాప్ కమిటీలు, నిర్ణయాధికార సంస్థల జాబితాను ఎన్నికల సంఘం తీసుకుంటుంది. వాటిలో ఎంత మంది సభ్యులు, ఆఫీస్ బేరర్లు ఏ వర్గంలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కాకుండా ఏ గ్రూపులో ఎంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారన్నది కూడా ఈసీ విచారణలో తెలుసుకుంటుంది.

షిండే అనుభవాల నుంచి…

ఈ ఏడాది ఫిబ్రవరిలో శివసేన షిండే వర్గం విషయంలో శాసనసభలో బలంతో పాటు పార్టీలో బలం ఆధారంగా ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని వెలువరించింది. తన 78 పేజీల నిర్ణయంలో షిండే వర్గం శాసనసభతో పాటు పార్టీలో కూడా మెజారిటీ కలిగి ఉన్నారని కమిషన్ పేర్కొంది. ఏక్‌నాథ్ షిండే వర్గానికి ‘శివసేన’ పేరుతో పాటు ఆ పార్టీ గుర్తు ‘విల్లు, బాణం’ కేటాయించింది. శివసేన టిక్కెట్‌పై గెలిచిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్ షిండే వర్గానికి 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. పార్టీలోని మొత్తం 47,82,440 ఓట్లలో 76% అంటే 36,57,327 ఓట్లు షిండే వర్గానికి అనుకూలంగా వచ్చాయి. వీరితో పాటు 12 మంది ఎంపీలు కూడా ఈ వర్గం వెంట నిలిచారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కేవలం 15 మంది ఎమ్మెల్యేలు, పార్టీలో 11,25,113 ఓట్లు మాత్రమే పొంది పార్టీ గుర్తును కోల్పోయింది. ఇప్పుడు ఎన్సీపీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి అజిత్ పవార్ వర్గం తగినంత సంఖ్యాబలాన్ని అటు చట్ట సభల్లో, ఇటు పార్టీ నిర్మాణంలో చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల గుర్తు కేటాయించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయాన్ని వెలువరించడానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు. ఈ క్రమంలో ఒక్కోసారి గుర్తును చీలిక వర్గాల్లో ఏ వర్గానికి దక్కకుండా స్తంభింపజేసి, తాత్కాలికంగా చెరో గుర్తును కూడా కేటాయించవచ్చు.

Eknath Shinde And Uddhav Thackeray[1]

Eknath Shinde And Uddhav Thackeray

1968కి ముందు ఇలాంటి సందర్భాల్లో ఏం జరిగింది?

1968లో ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ మరియు కేటాయింపు) ఆర్డర్ రాకముందు 1961 నాటి ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకునేది. 1968కు ముందు 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో చీలిక ఏర్పడింది. చీలిక వర్గం 1964 డిసెంబర్లో తమను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – సీపీఐ(ఎం)గా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తమకు మద్దతిచ్చిన ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఈ వర్గానికి మద్దతిచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు 3 రాష్ట్రాల్లో 4% కంటే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సంఘం తన విచారణలో గుర్తించింది. అటువంటి పరిస్థితిలో, ఎన్నికల సంఘం ఈ వర్గాన్ని సీపీఐ(ఎం)గా గుర్తించింది.

1968లో కొత్త రూల్ వచ్చిన తర్వాత మొదటి కేసు కాంగ్రెస్‌లో చీలిక. 1969లో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1969 మే 3న మరణించారు. ఉపాధ్యక్షుడు వివి గిరి తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. అప్పటి వరకు ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతిని చేసే ధోరణి ఉండేది. కానీ కాంగ్రెస్ లో ఓ వర్గం ఈ ఆలోచనను తిరస్కరించింది. దాంతో ఇందిరా గాంధీ, కాంగ్రెస్ లో మరో వర్గం అనుభవజ్ఞులైన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. సిండికేట్ నాయకులు కె.కామరాజ్, ఎస్.నిజలింగప్ప, అతుల్య ఘోష్‌లు నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఉపరాష్ట్రపతి వివి గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగమని ప్రోత్సహించారు. పార్టీ అధ్యక్షుడు నిజలింగప్ప జారీ చేసిన విప్‌ను ధిక్కరిస్తూ.. పార్టీ నేతలు మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని కోరారు. ఫలితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో వివి గిరి గెలుపొందారు. దీంతో నాటి కాంగ్రెస్ నుంచి ఇందిరను తొలగించారు. నిజలింగప్ప నేతృత్వంలోని పాత కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) ఒక వర్గంగా… ఇందిరా గాంధీ నేతృత్వంలోని కొత్త కాంగ్రెస్ (రిక్విజిషన్) గా విడిపోయింది. ఎన్నికల సంఘం పాత కాంగ్రెస్‌కు రెండు ఎద్దుల గుర్తును అలాగే ఉంచింది. ఇందిర వర్గానికి ‘ఆవు, దూడ’ గుర్తును ఇచ్చింది. ఎమర్జెన్సీ అనంతరం 1978 జనవరి 2న ఇందిర తన వర్గం నేతలతో పార్టీని చీల్చి కాంగ్రెస్ (ఐ) ఏర్పాటు చేశారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం హస్తం గుర్తును ఆ వర్గానికి కేటాయించింది. 1980 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం కాంగ్రెస్ (ఐ)ను అసలైన కాంగ్రెస్‌గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. 1996లో పార్టీ పేరు నుంచి (ఐ)ను తొలగించడంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో నేటికీ హస్తం గుర్తుతో ఆ పార్టీ కొనసాగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పలేదు. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. 1995లో నాటి రాష్ట్ర మంత్రి, ఎన్టీఆర్‌కు స్వయానా అల్లుడైన చంద్రబాబు నాయుడు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతులో పార్టీని గుర్తుతో సహా పూర్తిగా హస్తగతం చేసుకోగలిగారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?