AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: మణిపుర్‌లో ఆగని ఉద్రిక్తతలు.. స్కూల్లు తెరిచిన మరుసటి రోజే కాల్పులు

మణిపూపుర్‌లో చెలరేగిన ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఓ పాఠశాల బయట దుండగుడు ఓ మహిళను కాల్చి చంపడం కలకలం రేపింది. శిశు నిష్తా నికేతన్ స్కూల్ బయట ఈ దుర్ఘటన జరిగింది. పాఠశాలలు తెరిచిన మరుసటి రోజే ఈ హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Aravind B
|

Updated on: Jul 06, 2023 | 6:30 PM

Share

1 / 5
గత రెండు నెలలుగా మణిపుర్‌లో అల్లర్లు జరుగుతున్న కారణంగా అక్కడ విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే జులై 5 వ తేదీన ఆ రాష్ట్రంలో పాఠశాలలు తెరిచారు. అల్లర్ల భయంతో మొదటి రోజున తక్కువ విద్యార్థులే వచ్చారు. ఇప్పుడు పాఠశాల బయట మహిళను చంపడం ప్రజల్లో మరింత గుబులు మొదలైంది.

2 / 5
అలాగే బుధవారం రోజున థౌబల్ జిల్లాలో  ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌లో పనిచేసే ఓ జవాను ఇంటిని అల్లరి మూకలు దహనం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆయుధశాల నుంచి తుపాకులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకున్నందుకే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

3 / 5
మణిపుర్‌లో ఉద్రిక్తతలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇంటర్నేట్ సేవలు కూడా నిలిపివేశారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే సేవలు నిలిపివేసిన దానికి సంబంధించి మణిపుర్ హైకోర్టు ఇంతకుముందే విచారణ జరిపింది.

4 / 5
అయితే ఇంటర్నెట్ సేవలు మళ్లీ పునరుద్ధరించాలా లేదా అనే దానిపై కూడా నిపుణుల కమిటీ వేసింది. కానీ వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. మణిపుర్ హైకోర్టులోనే స్వతంత్ర పిటిషన్‌ను దాఖలు చేయవచ్చని పిటిషనర్‌కు సూచించింది.

5 / 5