- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches new foldable smartphone Xiaomi mix fold 3 features and price details
Xiaomi Mix Fold 3: షావోమీ నుంచి మడతపెట్టే ఫోన్ వచ్చేస్తోంది.. 108 ఎంపీ కెమెరా, మరెన్నో అద్భుత ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సావోమీ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ మిక్స్ ఫోల్డ్ 3 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోల్డింగ్ స్మార్ట్ ఫోన్‌లో స్టన్నింగ్ ఫీచర్స్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎప్పుడు లాంచ్ కానుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Jul 06, 2023 | 5:20 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి షావోమీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఫావోమీ మిక్స్ ఫోల్డ్ 3 పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టు నెలలో లాంచ్ చేయనున్నారు.

గతంలో షావోమీ నుంచి వచ్చిన మిక్స్ ఫోల్డ్ 2కి అప్‌డేట్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ధర విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనల రాకపోయినప్పటికీ ముందస్తు నివేదికల ప్రకారం కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఔటర్ ప్యానెల్, 8.02 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + ఇంటర్నల్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2400 x 1080 పిక్సెల్ రెజల్యూజన్ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ వీ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 1 టీబీ మెమొరీని అందించనున్నారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఇందులో 120 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4800 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.





























