- Telugu News Photo Gallery Technology photos Infinix launching new smartphone Infinix hot 30 5g features and price details
Infinix Hot 30 5G: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. రూ. 15వేల లోపు దుమ్మురేపే ఫీచర్స్
ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇన్‌ఫినిక్స్ హాట్ 30 పేరుతో లాంచ్ చేయనున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో మంచి ఫీచర్స్‌ను అందించనున్నారు. త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jul 06, 2023 | 8:33 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోన్న ఇన్‌ఫినిక్స్ తాజాగా మరో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొస్తోంది.

ఇన్‌ఫినిక్స్ హాట్ 30 పేరుతో లాంచ్ చేయనున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10 నుంచి రూ. 15 వేలలోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించిన ఈ స్మార్ట్ ఫోన్‌లో హోల్ పంచ్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరాను అందించారు. మీడియా టెక్ హీలియో జీ88 ఎస్వోసీ చిప్ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌ను ఇచ్చారు.

బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. 5జీ నెట్‌వర్క్‌తో తక్కువ బడ్జెట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.





























