Maharashtra: పుకార్లకు ఎండ్ కార్డ్.. బీజేపీకి షాక్.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన కీలక నిర్ణయం..
బీజేపీకి షాక్ ఇచ్చింది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS). ఇప్పటి వరకు ముంబై నగరపాలక ఎన్నికల్లో బీజేపీలో పొత్తు పెట్టుకుంటుందంటూ జరిగిన ప్రచారానికి..
బీజేపీకి షాక్ ఇచ్చింది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS). ఇప్పటి వరకు ముంబై నగరపాలక ఎన్నికల్లో బీజేపీలో పొత్తు పెట్టుకుంటుందంటూ జరిగిన ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసింది. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఎంఎన్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో ఎంఎన్ఎస్ వ్యవస్థాపకుడు రాజ్ థాకరే రాబోయే ఎన్నికలలో పొత్తుతో సహా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు, శివసేన గుర్తును స్తంభింపజేయడం ఉద్ధవ్ ఠాక్రేకు సానుభూతి లభిస్తోందనే పొలిటికల్ టాక్ వినిస్తోంది. అయితే, ఈ సానుభూతి ఉద్ధవ్‌కు ఎలాంటి సహాయం చేయదని రాజ్ థాకరే పార్టీ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని, సానుకూల దృక్పథంతో ఎన్నికల్లో పోరాడాలని, ఎంఎన్ఎస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాజ్ థాకరే.
అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఎంఎన్ఎస్ చీఫ్ సూచించారు. ఎంఎన్ఎస్ కార్యకర్తలే అధికారంలో ఉంటారని, ఉద్ధవ్ ఠాక్రే లాగా తాను కూడా అధికారం చేపట్టనని రాజ్ థాకరే స్పష్టమైన ప్రకటన చేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.
కాగా, గత కొన్ని నెలలుగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే.. రాజ్ థాకరేతో టచ్‌లో ఉంటున్నారు. పొత్తులపై చర్చలు జరుపుతున్నారు. ఆయన నివాసానికి వెళ్లి కూడా కలిశారు. దాంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీతో ఎంఎన్ఎస్ పొత్తు పెట్టుకోవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంతో తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని రాజ్ థాకరే స్పష్టం చేసినట్లు ఎంఎన్ఎస్ శ్రేణులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..