AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Yatra: చార్ ధామ్ యాత్రలో తెలుగువారి కష్టాలు.. కొండచరియలు విరిగిపడటంతో మార్గ మధ్యలో నిలిచిపోయిన యాత్రికులు

ప్రతికూల వాతావరణంతో చార్ ధామ్ యాత్రలో తెలుగువారు చిక్కుకున్నారు. బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, కేదరినాథ్​ఆలయాల సందర్శనను చార్ ధామ్ యాత్రగా పేర్కొంటారు. ఈ యాత్రలో భాగంగా గడ్డకట్టే చలిలో ఏటా వేలాది మంది భక్తులు ఆలయాలను..

Chardham Yatra: చార్ ధామ్ యాత్రలో తెలుగువారి కష్టాలు.. కొండచరియలు విరిగిపడటంతో మార్గ మధ్యలో నిలిచిపోయిన యాత్రికులు
Char Dham Yatra Pilgrim stuck in the middle of the road due to landslide
Amarnadh Daneti
|

Updated on: Oct 12, 2022 | 7:41 AM

Share

ప్రతికూల వాతావరణంతో చార్ ధామ్ యాత్రలో తెలుగువారు చిక్కుకున్నారు. బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, కేదరినాథ్​ఆలయాల సందర్శనను చార్ ధామ్ యాత్రగా పేర్కొంటారు. ఈ యాత్రలో భాగంగా గడ్డకట్టే చలిలో ఏటా వేలాది మంది భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. దీనిలో భాగంగా తెలగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఉత్తారఖండ్ లోని చార్ ధామ్ యాత్రకు వెళ్తుంటారు. యమునోత్రి లో కొండ చరియలు విరిగిపడటంతో దారి మధ్యలో చిక్కుకుపోయారు తెలుగువారు. చీరాల, ఇంకొల్లు, అద్దంకి ప్రాంతాల నుంచి తీర్థయాత్రలకు వెళ్లిన సుమారు 35 మంది తెలుగువారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల కు యమునోత్రి దాటి రెండు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కొండ చరియలు విరిగి పడ్డాయని వాటి మధ్యలో వాహనాల్లో ఉన్న యాత్రికులు చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణంతో దారి పొడువునా వందల వాహనాలు ఆగిపోయాయి. సహాయక చర్యలు మొదలుకాకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి నుంచి తాము మార్గ మధ్యలో చిక్కుకుపోతే ఇప్పటివరకు అధికారులు ఎవరూ స్పందించలేదని, సహాయక చర్యలు చేపట్టలేదని యాత్రకు వెళ్లిన చీరాలకు చెందిన గోపు రామచంద్రరావు తెలిపారు.

ప్రభుత్వ అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని యాత్రికులు కోరుతున్నారు. కొండచరియలు విరిగిపడటంతో మార్గం మధ్యలోనే నిలిచిపోవడంతో ఆహారం తయారుచేసుకోవడానికి అవకాశం లేదని, తిండి, తిప్పలు లేకుండా ఆకలితో ఉన్నట్లు యాత్రికులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం చీరాల నుంచి రైలులో వెళ్లిన యాత్రికులు ఢిల్లీ నుంచి బస్సులో యమునోత్రి మీదగా బార్కోటికి చేరాల్సి ఉంది. దురదృష్టవశాత్తు మధ్యలో కొండ చరియలు విరిగిపడటంతో బస్సులు ఆగిపోయాయి. కొండ ప్రాంతం కావడంతో చలి ఎక్కువుగా ఉండటంతో పెద్ద వయసు వారు ఇబ్బందులు పడుతున్నారు. సహాయం కోసం అక్కడి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు పని చేయడం లేదని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ యాత్రలో పిల్లలు కూడా ఉండటంతో ఆహారం లేక గత రాత్రి (మంగళవారం) నుంచి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని యాత్రికులు వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 బస్సుల్లో యాత్రికులు చార్ ధామ్ యాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్ లో మంచు వర్షం కారణంగా చార్ ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడుతూ వస్తోంది.

ఇవి కూడా చదవండి

కొండ చరియలు విరిగి పడటంతో యమునోత్రి -బార్కోటి మధ్య రహదారిలో నిలిచిపోయిన తెలుగు యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..