AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: క్యాన్సర్‌ కంటే డేంజర్.. అధికారం కోసం ఇండియా కూటమి పగటికలలు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

అధికారం కోసం పగటికలలు కంటున్న ఇండియా కూటమి నేతలను దేశ ప్రజలు జూన్‌ నాలుగున నిద్ర నుంచి లేపుతారంటూ ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ఇండియా కూటమి క్యాన్సర్‌ కంటే డేంజరని మండిపడ్డారు. లోక్‌సభ ఆరో విడత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు ప్రధాని మోదీ. యూపీలోని శ్రావస్తిలో జరిగిన సభలో ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు.

PM Modi: క్యాన్సర్‌ కంటే డేంజర్.. అధికారం కోసం ఇండియా కూటమి పగటికలలు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2024 | 8:10 PM

Share

అధికారం కోసం పగటికలలు కంటున్న ఇండియా కూటమి నేతలను దేశ ప్రజలు జూన్‌ నాలుగున నిద్ర నుంచి లేపుతారంటూ ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ఇండియా కూటమి క్యాన్సర్‌ కంటే డేంజరని మండిపడ్డారు. లోక్‌సభ ఆరో విడత ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు ప్రధాని మోదీ. యూపీలోని శ్రావస్తిలో జరిగిన సభలో ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వస్తామని రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ పగటికలలు కంటున్నారని విమర్శించారు. కేంద్రంలొ బీజేపీ మరోసారి అధికారం లోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారం లోకి ఆర్టికల్‌ 370ని పునరుద్దరిస్తామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారని అన్నారు. దేశానికి ఇండియా కూటమి క్యాన్సర్‌ కంటే డేంజర్‌ అని తీవ్ర విమర్శలు చేశారు మోదీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని సర్వనాశనం చేస్తారని.. జన్ ధన్ బ్యాంకు అకౌంట్లను రద్దు చేస్తారంటూ పేర్కొన్నారు.

మతరాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు, రేసిస్ట్‌ రాజకీయాలతో ప్రజలను ఇండియా కూటమి నేతలు రెచ్చగొడుతున్నారని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి పనిచేశాయని, మళ్లీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఏకం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పాకిస్తాన్‌ పనిఅయిపోయిందని, తిండి లేక అక్కడి ప్రజలు అలమటిస్తున్నారని అన్నారు మోదీ. కానీ ఉగ్రవాదులకు మద్దతుగా ఎస్పీ, కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

పాకిస్తాన్‌ దగ్గర అణుబాంబులు ఉన్నాయని ఈ రెండు పార్టీలు బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయని , కాని ఇక్కడ మోదీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. తాము ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు. జూన్‌ నాలుగున యూపీ ప్రజలు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ నాయకులను నిద్ర నుంచి లేపుతారని ప్రధాని మోదీ అన్నారు.

యూపీలో 79 సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి నేతలు చెప్తున్న మాటలను ప్రధాని మోదీ.. ఎగతాళి చేశారు. పగటి కలలు అనే మాటను తాను వినేవాడినని ఇప్పుడు వాటిని ప్రత్యక్ష చూస్తున్నానని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..