కోడలిగా వెళ్లి ఆడబడుచుపై మనసు పడ్డ యువతి.. కలిసే జీవిస్తాం మరణిస్తాం అంటున్న వదిన ఆడబడుచులు

ఓ వివాహిత తన సొంత ఆడబడుచుతో ప్రేమలో పడింది. ఆమె కూడా తన వదినను ఇష్టపడటం మొదలుపెట్టింది. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే విడిపోవడానికి ఇద్దరూ అంగీకరించలేదు. తాము కలిసి జీవిస్తామని.. కలిసి మరనిస్తామని మమ్మల్ని ఎవరూ విడదీయలేరని చెప్పారు.

కోడలిగా వెళ్లి ఆడబడుచుపై మనసు పడ్డ యువతి.. కలిసే జీవిస్తాం మరణిస్తాం అంటున్న వదిన ఆడబడుచులు
Bhabhi Love Story
Follow us
Surya Kala

|

Updated on: May 22, 2024 | 6:36 PM

ప్రస్తుతం బంధానికి అర్ధం మారిపోయింది. అమ్మాయికి అమ్మాయితో, అబ్బాయికి అబ్బాయితో ఎఫైర్ ఉండటం సర్వసాధారణమైపోయింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వివాహిత తన సొంత ఆడబడుచుతో ప్రేమలో పడింది. ఆమె కూడా తన వదినను ఇష్టపడటం మొదలుపెట్టింది. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే విడిపోవడానికి ఇద్దరూ అంగీకరించలేదు. తాము కలిసి జీవిస్తామని.. కలిసి మరనిస్తామని మమ్మల్ని ఎవరూ విడదీయలేరని చెప్పారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. బాలికలిద్దరికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరువురు కుటుంబసభ్యులతోనూ చర్చించనున్నారు. ఈ సంఘటన ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ పట్టణంకి చోటు చేసుకుంది. ఇక్కడ ఓ వివాహత స్త్రీ తన ఆడబడుచుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ ఒకే పరిసరాల్లో నివసిస్తున్నారు. ఎఫైర్ మొదలయ్యాక ఇద్దరూ రోజంతా ఒకరితో ఒకరు గడపడం మొదలుపెట్టారు.

ఒక్కోసారి వదిన దగ్గరకు ఆడబడుచు, ఒక్కోసారి ఆడబడుచు దగ్గరకు వదిన వెళ్లేది. రాత్రి సమయంలో ఇద్దరూ కలిసి ఉండడం ప్రారంభించారు. ఈ సాన్నిహిత్యంపై కుటుంబ సభ్యుల్లో అనుమానాలు కలిగింది. దీంతో వారు రహస్యంగా కలుసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. వారిద్దరినీ కుటుంబ సభ్యులు అభ్యంతరకర స్థితిలో పట్టుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.

ఇవి కూడా చదవండి

విషయం పోలీసుల వరకు చేరింది

ఈ విషయాన్ని అత్తమామలు కోడలు తల్లిదండ్రులకు చెప్పారు. కోడలు సోదరుడు వచ్చాడు. ఇదంతా సరికాదని తన సోదరికి నచ్చచెప్పాడు. అయినా కోడలు అంగీకరించలేదు. ఆమె సోదరుడు ఆమెను అక్కడి నుంచి తన తల్లి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే తన ఆడబడుచుని విడిచి ఉండలేక ఆమెను కలవడానికి ఆమె అత్తారింటికి వెళ్ళింది. దీంతో అక్కడ కూడా తోపులాట జరిగింది. విషయం పోలీసుల వరకు చేరింది. అప్పుడు కూడా ఆడవాళ్ళిద్దరూ ఒకరికొకరు లేకుండా బ్రతకలేమని చెబుతున్నారు. ఒకరితో ఒకరు జీవించాలనుకుంటుట్లు చెప్పారు.

ఆ ప్రాంతంలో చర్చ జరుగుతోంది

ఈ విషయమై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. యువతి (కోడలు) సోదరుడు, తల్లి పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో కోడలు కుటుంబ సభ్యులు కూడా తమ కూతురికి ఇది తప్పని చెబుతూ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు మహిళలకు కౌన్సలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. ఈ అంశం యావత్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..