Hindu Marriage: వివాహ క్రతువులో అరుంధతి నక్షత్ర వీక్షణం ఒకటి.. నవ దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా..
ప్రస్తుతం నవ దంపతులకు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న కార్యక్రమం యువతీయువకుల పరిహాలు వెకిలి చేష్టలు, అర్ధం పదం లేని మాటలతో సాగుతోంది. కానీ అసలు నవ దంపతులకు నింగిలోని చుక్కను.. అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారనే విషయం తెలియకపోవడమే కారణం కావొచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు.. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి గురించి పురాణాల పేర్కొన్న కథనం ఈ రోజు తెలుసుకుందాం..
హిందూ సంప్రదాయంలో వివాహ ఘట్టానికి ప్రత్యెక స్థానం ఉంది. స్త్రీ, పురుషులను ఒక్కటిగా కలిపే పెళ్లిని ఓ పవిత్ర కార్యంగా భావిస్తుంది. వధూవరులు ధరించే వస్త్రాల నుంచి, తాళి, మెట్టెలు, నల్లపూసలు, అగ్ని సాక్షి, సప్తపది, అరుంధతి నక్షత్ర వీక్షణం వంటి అనేక రకాల తంతులతో జరిగే ఇద్దరు వ్యక్తులను కలిపే పవిత్రమైన వేడుక. అయితే ప్రస్తుతం నవ దంపతులకు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న కార్యక్రమం యువతీయువకుల పరిహాలు వెకిలి చేష్టలు, అర్ధం పదం లేని మాటలతో సాగుతోంది. కానీ అసలు నవ దంపతులకు నింగిలోని చుక్కను.. అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారనే విషయం తెలియకపోవడమే కారణం కావొచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు.. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి గురించి పురాణాల పేర్కొన్న కథనం ఈ రోజు తెలుసుకుందాం..
అవును నేటి తరంలో చాలా అరుంధతి నక్షత్రం గురించి తెలియకపోవచ్చు. కానీ మన తాతలు ముత్తలకు ఆమె గురించి తెలుసు..పర పురుషుడిని కన్నెత్తి చుదాని మహా పతివ్రత.. ఇంకా చెప్పాలంటే.. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. అరుంధతి, సీతా, సావిత్రి, అనసూయ, సుమతి వంటి పతివ్రతల్లో మొదటిస్థానం అరుంధతిదే. మంచి అందగత్తె అయిన అరుంధతి నింగిలో చక్కని చుక్కలా సప్తర్థి మండలంలో తన భర్త ఉన్న వశిష్టుని తార పక్కన నిలిచిపోయింది.
అరుంధతి గురించి అనేక పురాణాల కథలున్నాయి..
వశిష్ట మహర్షి పెళ్లి చేసుకోవాలానే కోరికతో నచ్చిన యువతి కోసం తిరుగుతూ ఒక గ్రామానికి చేరుకున్నాడు. అప్పుడు అతనిని చూడడానికి కన్నెలంతా వచ్చారు. అప్పుడు వశిష్ట మహర్షి కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకుని ఈ ఇసుకను ఎవరైనా అన్నంగా తయారు చేసి తీసుకుని రమ్మనమని అడిగాడు. అయితే అది ఎవరి వల్లా కాదంటూ చెప్పారు. అప్పుడు పక్క గ్రామంలోని ఒక పంచమ కులానికి చెందిన అందమైన యువతి వచ్చి తాను ఇసుకని అన్నంగా చేస్తానని చెబుతుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టి ఎసరు మరిగించి అందులో ఇసుక వేసింది. దేవుడిని ధ్యానం చేస్తూ వంట చేసింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం తినమంటూ వడ్డించగా.. తనను పెళ్లి చేసుకోమని కోరతాడు. అప్పుడు తన తల్లిదండ్రుల అంగీకారం తీసుకోమని చెబుతుంది అరుంధతి. అలా అరుంధతి తల్లిదండ్రుల అంగీకారంతో వశిష్ట మహర్షి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు.
భర్త మాట జవదాటని మహా సాధ్వి అరుంధతికి ఒకసారి వశిష్ట మహర్షి తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తూ.. తాను తిరిగి వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. సంవత్సరాలు గడుస్తున్నా భర్త రాకపోయినా అరుంధతి ఆ కమండలం వైపే చూస్తూ ఉంటుంది.
మరోవైపు సప్త రుషులు యజ్ఞం చేస్తూ అగ్ని దేవుడిని ఆహ్వానిస్తారు. అప్పుడు అగ్ని దేవుడు సప్త మహర్షుల భార్యపై మోజు పడతాడు. ఈ విషయాన్నీ అగ్ని దేవుడి భార్య స్వాహ దేవి గ్రహించి తానే రోజు ఒక సప్త రుషులు భార్య రూపంలోకి మారి భార్య కోరిక తీరుస్తుంది. అలా ఆరు రోజులు గడిచిపోయాయి. ఏడవ రోజు అగ్ని దేవుడు తాను ఈ రోజు అరుంధతి ని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు. అయితే స్వాహా దేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి గా మారలేకపోయింది. దీనికి కారణం ఆమె భర్తనే దైవంగా భావించి కొలవడం.
అందుకే అరుంధతి నక్షత్రంగా మారి వివాహానికి అర్ధం చెబుతూ దంపతులకు ఆదర్శంగా నిలిచింది. వసిష్టుడు అరుంధతి దంపతులకు “శక్తి’ అనే కుమారుడు.. శక్తి కుమారుడు పరాశరుడు.. పరాశరుడి కుమారుడు మహా భారతాన్ని మానవాళికి అందించిన వ్యాసుడు.. ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.
నవ దంపతులు ఎందుకు చూస్తారంటే..
కొత్త పెళ్ళైన దంపతులకు నింగిలో వెలుగుతున్న అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. వశిష్ట, అరుంధతీ దంపతులు ఆదర్శ దంపతులకు ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు ఆ దంపతుల్లా జీవించాలనే ఉద్దేశ్యంతో ఆకాశంలో తారారూపంలో వెలుగొందుతున్న వారిని వీక్షింపజేస్తారు. ఇలా చేయడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు