AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buddha Purnima 2024: ఇంట్లో సుఖ సంతోషాల కోసం బుద్ధ పూర్ణిమ రోజున ఈ వస్తువులను దానం చేసి చూడండి..

ఈ సంవత్సరం 2024లో బుద్ధ పూర్ణిమ గురువారం మే 23న జరుపుకోనున్నారు. ఇది చాలా పవిత్రమైన రోజు. వైశాఖ మాసంలో చేసే దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రకరకాల సందర్భాలను పురష్కరించుకుని రకరకాల విరాళాలు ఇస్తుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల వ్యక్తులకు జ్ఞానం లభిస్తుందని.. అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఒక నమ్మకం. శాంతి కలుగుతుంది. బుద్ధ పూర్ణిమ రోజున దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి

Buddha Purnima 2024: ఇంట్లో సుఖ సంతోషాల కోసం బుద్ధ పూర్ణిమ రోజున ఈ వస్తువులను దానం చేసి చూడండి..
Buddha Purnima 2024
Surya Kala
|

Updated on: May 22, 2024 | 3:03 PM

Share

వైశాఖ పూర్ణిమ ను బుద్ధ పూర్ణిమ, బుద్ధ జయంతి మరియు బుద్ధ జన్మోత్సవం అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి బౌద్ధ మతస్థులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది బుద్ధు భగవానుడు జన్మించిన రోజు. అంతేకాదు బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిన రోజు, అంతేకాదు మహాపరినిర్వాణం చెందిన పరమ పవిత్రమైన రోజు. ఈ సంవత్సరం 2024లో బుద్ధ పూర్ణిమ గురువారం మే 23న జరుపుకోనున్నారు. ఇది చాలా పవిత్రమైన రోజు.

వైశాఖ మాసంలో చేసే దానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రకరకాల సందర్భాలను పురష్కరించుకుని రకరకాల విరాళాలు ఇస్తుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల వ్యక్తులకు జ్ఞానం లభిస్తుందని.. అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఒక నమ్మకం. శాంతి కలుగుతుంది. బుద్ధ పూర్ణిమ రోజున దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

బుద్ధ పూర్ణిమ నాడు చేయాల్సిన దానాలు ఏమిటంటే..

  1. బుద్ధ పూర్ణిమ సందర్భంగా సన్యాసులకు, పేదలకు దానం చేయడం అత్యంత పుణ్యమైన దానధర్మంగా పరిగణించబడుతుంది. వారికి ఆహారం, బట్టలు, మందులు లేదా ఇతర అవసరమైన వస్తువులను చేయవచ్చు.
  2. పేద, పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు మొదలైన విద్యా సామగ్రిని దానం చేయడం పుణ్యం. దీంతో పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది.
  3. ధాన్యం, పప్పులు, బియ్యం, పిండి, నూనె, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పేదలకు, ఆకలితో ఉన్నవారికి దానం చేయడం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. ఇది సమాజంలో ఆకలిని నిర్మూలించడానికి సహాయపడుతుంది.
  4. మందులు, వైద్య పరికరాలు లేదా ఇతర వైద్య సామాగ్రిని ఆసుపత్రులకు, అవసరమైన వారికి దానం చేయడం పుణ్యం. ఇది వ్యాధిగ్రస్తుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
  5. పర్యావరణం పట్ల మీ బాధ్యతను నెరవేర్చడానికి బుద్ధ పూర్ణిమ సందర్భంగా చెట్లను నాటవచ్చు లేదా చెట్ల పెంపకం ప్రచారంలో పాల్గొనవచ్చు.
  6. వేసవి కాలంలో దాహంతో ఉన్న పక్షులకు, జంతువుల దాహార్తిని తీర్చే విధంగా ఏర్పాట్లు చేయడం పుణ్యం. బహిరంగ ప్రదేశాల్లో మట్టి పాత్రలో నీటిని ఉంచవచ్చు.
  7. దేవాలయాలు, గోశాలలు లేదా ఇతర మత సంస్థలకు విరాళం అందించవచ్చు. ఈ చర్య జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తుంది.

ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

బుద్ధ పూర్ణిమ రోజున చేసే దానం ఆధ్యాత్మిక సంతృప్తిని అందించడమే కాదు.. జీవితంలో సానుకూల మార్పులను కూడా తెస్తుంది. విశ్వాసం, ఆర్ధిక శక్తి సామర్ధ్యాల మేరకు ఏదైనా వస్తువులను దానం చేయవచ్చు. లేదా విరాళం అందించడానికి ఏదైనా సామాజిక సంస్థ లేదా ప్రభుత్వేతర సంస్థ (NGO)లో కూడా చేరవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు