Chanakya Niti: వివాహబంధం హ్యాపీగా సాగాలంటే భార్య పొరపాటున కూడా ఈ 5 పనులు చేయవద్దు..

చాణక్య నీతి ప్రకారం ముఖ్యంగా మహిళలు మాట్లాడే మాటలు భార్య భర్తల బంధంలో చీలికను కలిగిస్తుందట. సంబంధాన్ని బలోపేతం చేయడానికి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, భార్యలు తమ భర్తల ముందు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూదట. భార్యలు తమ భర్తలతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వివాహాన్ని విడదీయరాని సంబంధం అంటారు. అయితే కొన్ని సార్లు చిన్న విషయాలే ఈ బంధం బీటలు వారేటట్లుగా చేస్తుందట.

Chanakya Niti: వివాహబంధం హ్యాపీగా సాగాలంటే భార్య పొరపాటున కూడా ఈ 5 పనులు చేయవద్దు..
Chanakya Niti
Follow us

|

Updated on: May 22, 2024 | 5:51 PM

జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో.. పెళ్లయిన తొలినాళ్లలో అది అంత సున్నితంగా ఉంటుంది. వివాహం జరిపించే సమయంలో స్త్రీ, పురుషులు ఏడు ప్రమాణాలు చేస్తారు. అందులో ఒకటి ప్రతి సుఖం, దుఃఖంలో ఒకరినొకరు అండగా ఉంటామని చెప్పడం. అయితే వాస్తవంగా నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఒకొక్కసారి చిన్న చిన్న విషయాలే పెద్ద కారణాలుగా మారి భాగస్వామి మనస్సులో ఆగ్రహాన్ని సృష్టిస్తాయి. సంబంధంలో చీలికను సృష్టించవచ్చు.

చాణక్య నీతి ప్రకారం ముఖ్యంగా మహిళలు మాట్లాడే మాటలు భార్య భర్తల బంధంలో చీలికను కలిగిస్తుందట. సంబంధాన్ని బలోపేతం చేయడానికి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, భార్యలు తమ భర్తల ముందు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూదట. భార్యలు తమ భర్తలతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వివాహాన్ని విడదీయరాని సంబంధం అంటారు. అయితే కొన్ని సార్లు చిన్న విషయాలే ఈ బంధం బీటలు వారేటట్లుగా చేస్తుందట.

పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు చాణక్య నీతి ప్రకారం వివాహం అయిన తర్వాత స్త్రీలు తమ భర్త లేదా అత్తమామల ముందు తల్లిదండ్రులను ప్రశంసించకూడదు. అంతేకాదు భర్త ముందు అత్త, మామ, అతని సోదరి లేదా సోదరుడి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడడం భర్తకు నచ్చదు. అదే విధంగా భర్త తన తల్లిదండ్రులకు సంబంధించిన కబుర్లను పదే పదే చెప్పడం మంచిది కాదు. ఇలా చేయడం భార్యభర్తల సంబంధంలో చీలికకు కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

అబద్ధాలు, కోపం చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పకోకూడదు. ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే అనవసరంగా అనుమానం పెరుగుతుంది. ఇది సంబంధాన్ని దెబ్బతీస్తుంది. వైవాహిక జీవితంలో కోపం అనే పదాన్ని మరచిపోవాలి. ఎందుకంటే కోపంలో వ్యక్తులు ఒకరితో ఒకరు విసురుకునే మాటలు మనసుని బాధిస్తాయి. తరువాత చింతించాల్సి ఉంటుంది. కోపంలో ఉన్న వ్యక్తి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తొందరపడి తీసుకుంటాడు.

అహంకారం, అనవసరమైన ఖర్చు అహం కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు తక్కువగా అంచనా వేసుకుంటారు. ఇది సంబంధాల ముగింపుకు అతిపెద్ద కారణం అవుతుంది. భార్యాభర్తలు ఎప్పుడూ అహాన్ని పక్కనపెట్టి తప్పు చేస్తే ఆలస్యం చేయకుండా క్షమించమని అడగాలి. భార్యాభర్తలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మానుకోవాలి. అనవసర ఖర్చుల వల్లనో, చెడు అలవాట్ల వల్లనో డబ్బు నీళ్లలా వృధా అవుతుంది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది.

దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి భార్యాభర్తలు తమ వ్యక్తిగత విషయాలను తమకే పరిమితం చేసుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. వైవాహిక జీవితంలో సంతోషాన్ని కోరుకుంటే ఇతరులు ఎంత సన్నిహితంగా ఉన్నా తమ భావాలను ఎవరికీ చెప్పకూడదు. వివాహిత సంబంధంలో భార్యాభర్తలు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. కొన్ని పనులు సరైన సమయంలో ఆపకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు శాశ్వతంగా చెడిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు